Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీ డబుల్ ఇంజన్ సర్కార్ స్లోగన్ కు సాయిరెడ్డి కౌంటర్..! గతాన్ని గుర్తుచేస్తూ..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. ముఖ్యంగా ప్రత్యర్ధుల్ని టార్గెట్ చేసే క్రమంలో గతాన్ని ఎక్కువగా తక్కుకోవడం కనిపిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా చిలకలూరిపేట సభలో ప్రధాని మోడీ ఏపీలో మరోసారి డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందంటూ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. గతంలో మీ డబుల్ ఇంజన్ సర్కార్ తో ఏం జరిగిందో తెలియదా అంటూ ప్రశ్నించారు.

ఏపీ 204-18 మధ్య మీ డబుల్ ఇంజన్ సర్కార్ చూసిందని, ఇందులో బీజేపీ-టీడీపీల ఇంజన్లు రెండూ వ్యతిరేక దిశలో పనిచేశాయని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. విధానాల పక్షవాతం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధలో స్తబ్ధత, తీవ్ర అవినీతికి ఇది దారి తీసిందన్నారు. టీడీపీ హయాంలో ఓ జిల్లా, ఓ కులం, ఓ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాయని సాయిరెడ్డి సంచలన విమర్శలు చేశారు. తద్వారా మరోసారి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇదే జరుగుతుందని సాయిరెడ్డి పరోక్షంగా చెప్పేశారు.

ysrcp mp vijayasai reddy mocks pm modi s double engine sarkar slogan

ఏపీలో 2014-2018 మధ్య బీజేపీ-టీడీపీ ఉమ్మడిగా ఎన్డీయే సర్కార్ ను నడిపించాయి. అప్పట్లో ప్రత్యేక హోదా తీసుకురాలేదంటూ వీరిద్దరినీ టార్గెట్ చేసిన జగన్.. 2019లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత కూడా టీడీపీ ప్రభుత్వం గురించి, పాలన గురించి ఇప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తుండటంతో మరోసారి ఆ డబుల్ ఇంజన్ సర్కార్ ను గుర్తుచేస్తూ సాయిరెడ్డి దీని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+