ఏపీలో పోటా పోటీగా సర్వేలు ! ఏది అసలు ? ఏది ఫేక్ ? సాయిరెడ్డి సెటైర్లు...
ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా సర్వేల హంగామా కనిపిస్తోంది. ఎన్నికలకు దాదాపు ఏడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో వివిధ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు సాధారణ ఓటరు చూపిస్తుంటడంతో సర్వే సంస్ధలు కూడా అదే పనిగా నెలకో సర్వే విడుదల చేస్తున్నాయి. వీటిలో పలు జాతీయ మీడియా సంస్ధలతో పాటు స్ధానిక సర్వే సంస్ధలు కూడా ఉంటున్నాయి. వీటిలో కొన్ని వైసీపీ మరోసారి గెలిచి తీరుతుందని చెప్తుంటే, మరికొన్ని టీడీపీకి ఆధిక్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 25 సీట్లకు గాను 25 సీట్లు గెలిచి తీరుతుందంటూ టైమ్స్ నౌ సంస్ధ తాజాగా కొంత గ్యాప్ తో రెండు సర్వేలు విడుదల చేసింది. అలాగే మరికొన్ని సంస్ధలు కూడా మరోసారి గెలిచేది వైసీపీయే నంటూ పలు గణాంకాలను విడుదల చేస్తున్నాయి. దీంతో ఇప్పటివరకూ వైసీపీ హ్యాపీగా కనిపించింది. అయితే తాజాగా ఇండియా టుడే వెలువరించిన సర్వే మాత్రం వైసీపీకి షాకిచ్చింది. ఏపీలో విపక్ష టీడీపీకి దాదాపు 15 ఎంపీ సీట్లు వస్తాయని తొలిసారిగా స్పష్టం చేసింది. దీంతో టీడీపీ క్యాంపు సంతోషంలో మునిగిపోయింది.

ఈ నేపథ్యంలో టైమ్స్ నౌతో పాటు మరికొన్ని సంస్ధలు ఇన్నాళ్లూ వైసీపీ గెలవబోతోదంటూ ఇచ్చిన సర్వే నివేదికలు ఫేక్, పెయిడ్ అంటూ విపక్ష టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా ఛానళ్లలో దీనిపై పలు చర్చలు కూడా పెడుతున్నారు. అలాగే ఇండియా టుడే సర్వే మాత్రం ఒరిజినల్ అంటూ ఆయా సంస్ధలు ప్రచారం ముమ్మరం చేశాయి. దీంతో ఇండియా టుడే సర్వేపైనా చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ సెటైర్లు వేశారు.

ఏ జాతీయ సంస్ధ సర్వే వచ్చినా అయి ఫేక్, పెయిడ్ అంటూ సొంత కథనాలు వండి వారుస్తోంది జాతి పచ్చ మీడియా (టీడీపీ అనుకూల మీడియా) అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మరి ఇండియా టుడే సర్వే మాత్రం అసలు సిసలు సర్వే అంటూ ఊదరగొడుతోందన్నారు.
పచ్చపార్టీ గెలుస్తుందని చెబితేనే ఒరిజనలా లేకపోతే ఫేకా అంటూ విజయసాయిరెడ్డి టీడీపీతో సహా విపక్షాల్ని ప్రశ్నించారు. ఇప్పటివరకూ వచ్చిన సర్వేలన్నీ వదిలిపెట్టి ఇండియా టుడే సర్వేను మాత్రమే విపక్షాలు,వాటికి అనుకూీలంగా ఉండే సంస్ధలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సాయిరెడ్డి దీన్ని తన ట్వీట్ లో ఆక్షేపించారు.












Click it and Unblock the Notifications