అదే 23... పోలింగ్ శాతంతో చంద్రబాబును సాయిరెడ్డి ట్రోలింగ్..!

ఏపీలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికీ, టీడీపీ అధినేత చంద్రబాబుకీ మధ్య వైరం అందరికీ తెలిసింది. అవకాశం దొరికితే చాలు చంద్రబాబును ట్వీట్లతో ఆడుకునేందుకు సాయిరెడ్డి ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఇదే క్రమంలో తాజాగా జరిగిన ఎన్నికల పోలింగ్ శాతం రూపంలో మరోసారి ఆయనకు అవకాశం దొరికింది. దీన్ని ఆయన వదులుకుంటారా ? మరోసారి చంద్రబాబును దీనికి లింక్ చేస్తూ ట్వీట్ పెట్టేశారు.

రాష్ట్రంలో ఈసారి నమోదైన తుది పోలింగ్ శాతం 81.86గా ఈసీ తాజాగా ప్రకటించింది. ఇందులో ఉన్న నాలుగు సంఖ్యలు 8186ని కలిపితే 23 అవుతుంది. గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 23. అంతకు ముందు వైసీపీ నుంచి టీడీపీ లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ గతంలో వైఎస్ జగన్ దేవుడి స్క్రిప్ట్ అంటూ పదే పదే విమర్శలు చేసేవారు. ఇప్పుడు పోలింగ్ శాతంలో నంబర్లు అన్నీ కలిపితే 23 కావడంతో సాయిరెడ్డి ఇక అందుకున్నారు.

ysrcp mp vijayasai reddy trolling Chandrababu with ap polling percentage total 23

రాష్ట్రంలో పోలింగ్ శాతంపై ఈసీ చేసిన ప్రకటనలో పేర్కొన్న గణాంకాలను పోస్టు రూపంలో ప్రస్తావిస్తూ, మరోవైపు చంద్రబాబు ఫొటో పెట్టి పోలింగ్ శాతంలో నంబర్లన్నీ కూడితే 23 నంబర్ వస్తుందని చూపిస్తూ విజయసాయిరెడ్డి ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఇప్పటికే వైసీపీ నాయకులు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు వారికి సాయిరెడ్డి ట్వీట్ కూడా దొరకడంతో పండగ చేసుకుంటున్నారు. ఈసారి కూడా టీడీపీకి 23 సీట్లే అంటూ వైరల్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+