సాయిరెడ్డి కరోనాను జయించారు.. ఆ భగవంతుడి దయతోనే, వెల్ విషర్స్‌కు థాంక్స్ చెబుతూ ట్వీట్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా పాజిటివ్‌ను జయించారు. తనకు వైరస్ తగ్గడంతో డిశ్చార్జ్ అయ్యానని తెలిపారు. గత నెల 21వ తేదీన తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆయన పీఏ కూడా చికిత్స తీసుకున్నారు. దాదాపు 12 రోజులు ట్రీట్ మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయినట్టు ట్వీట్‌లో పేర్కొన్నారు.
Recommended Video
భగవంతుడి దయతో..
ఆ భగవంతుడి దయతో కరోనాను జయించానని సాయిరెడ్డి ట్వీట్ చేశారు. తాను కోలుకోవాలని శ్రేయోభిలాసులు కోరుకున్నారని.. వారి ప్రార్థనల బలంతోనే తనకు వైరస్ తగ్గిందని వివరించారు. తన కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞుడిని అని పేర్కొన్నారు. మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతీ ఒక్కరు జయించాలని సాయిరెడ్డి నిండు మనస్సుతో కోరుకున్నారు.

దూరం.. దూరంగా...
కరోనా వైరస్ సోకడంతో ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండనని విజయసాయిరెడ్డి ముందే చెప్పారు. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నారు. అత్యవసరమైతే తప్ప తనను సంప్రదించొద్దని సూచించారు. 10 రోజులపాటు అందుబాటులో ఉండనని చెప్పడంతో... శ్రేణులు కూడా ఆయనకు దూరంగా ఉన్నారు. ఇటీవల అంబటి రాంబాబు కూడా కరోనా వైరస్ తగ్గడంతో డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.

ఇలా సోకి ఉంటుంది..?
ఇటీవల వైఎస్ జయంతి కార్యక్రమంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళంలో జరిగిన సభకు చాలా మంది హాజరయ్యారు. విజయసాయిరెడ్డి వెంట మందీ మార్బలం ఉంటారని.. సామాజిక దూరం నిబంధన పట్టించుకోరనే అపవాదు ఉంది. దాంతో కరోనా వైరస్ సోకి ఉండొచ్చని అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో పలువురిని కలువడం ద్వారా వైరస్ సోకి ఉంటుంది. వెంటనే జూలై 21వ తేదీన ఆస్పత్రిలో చేర్చి.. ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత తొలి ట్వీట్ చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications