ప్రభుత్వ అవినీతిని అడ్డుకొంటే రాక్షసులమా?: వైవీ సుబ్బారెడ్డి

హైదరాబాద్: ప్రతి సంక్షేమ పథకంలో భారీ అవినీతి, దోపిడీ జరుగుతోందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు వైవీ సుబ్బారెడ్డి.

అభివృద్ధి పేరుతో చేస్తున్న ప్రతి అవినీతిని అడ్డుకుంటామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.. ప్రభుత్వం చేసే అవినీతిని అడ్డుకుంటే రాక్షసులమౌతామా అని ప్రశ్నించారు. దోపిడిని ఆపాలనే అడ్డుపడుతున్నామని ఆయన చెప్పారు.

Ysrcp mp Yv Subbareddy slams on Chandrababunaidu

ఉపాధి హామీ నిధుల్లో భారీ అవినీతి జరుగుతోందని, సాక్షాత్తు కేంద్రమే నిధుల దుర్వినియోగం గురించి చెప్పిందని ఆయన వివరించారు. ప్రభుత్వ అవినీతిని అడ్డుకుంటున్నందుకే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్సీపీపై బురద చల్లుతున్నారని విమర్శించారు

. ఉపాధి హామీ నిధుల అమలును కాగ్‌ రిపోర్టు తప్పు పట్టిందని వైవీ గుర్తుచేశారు. ఉపాధి హామీ పనులు, నిధుల్లో అవకతవకలు జరిగాయనడానికి తమ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు.

పేదలకు ఉపాధి కల్పించాల్సిన ఉపాధి నిధులను, పచ్చచొక్కాలకు మాత్రమే లబ్థి చేకూరేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని వైవీ విమర్శించారు. పేదల కడుపు కొట్టే ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకుంటే అభివృద్ధి నిరోధకులు అంటూ వైఎస్సార్సీపీపై బురద చల్లుతారా అంటూ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+