వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీపై కేంద్రం ఒక్కసారిగా - శ్రీలంక పరిస్థితులతో : వైసీపీ ఆగ్రహం - వాట్ నెక్స్ట్..!!

|
Google Oneindia TeluguNews

కేంద్రం తీరులో మార్పు కనిపిస్తోంది. ఒక్కసారిగా ఏపీకి సంబంధించిన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పు బట్టే విధంగా వ్యవహరించింది. శ్రీలంక పరిస్థితుల పైన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ తో సహా పది రాష్ట్రాల ఆర్దిక పరిస్థితులను కేంద్రం ప్రస్తావించటం..కలకలం రేపింది. ఏపీలో అధికార వైసీపీతో సహా.. టీఆర్ఎస్.. ఇతర రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసాయి. శ్రీలంక పరిస్థితుల పైన సమావేశం నిర్వహిస్తూ..రాష్ట్రాల పరిస్థితులను ప్రస్తావించటం పైన వైసీపీతో సహా ఇతర పార్టీలు ఆగ్రహించాయి. కేంద్రం చేసిన అప్పుల గురించి వివరించాలని డిమాండ్ చేసాయి. శ్రీలంకలో పరిస్థితులను వివరిస్తూ.. ఉచితాలు, అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో శ్రీలంకలో వ్యవస్థ కుప్పకూలిందని కేంద్రం వివరించింది. అక్కడి పరిస్థితులను చూసి ఈ రాష్ట్రాలు అప్రమత్తం కావాలని హెచ్చరించింది.

కేంద్రం తీరు పై ఏపీ అహనం

కేంద్రం తీరు పై ఏపీ అహనం

ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని 10 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, హరియాణా, ఝార్ఖండ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఏపీ గురించి వివిరస్తూ రాష్ట్రంలో రుణాల గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌ రుణాలు జీఎస్‌డీపీలో 32%కి చేరినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాలు రుణ, ఆర్థిక కొలమానాలను దాటినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రుణాలు జీఎస్‌డీపీలో 25%కి చేరాయని తెలిపారు. దీని పైన టీఆర్ఎస్ ..వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. అయితే, దీనికి కేంద్రం వివరణ ఇచ్చింది. రాష్ట్రాల పరిస్థితుల గురించి వాస్తవాలే చెప్పామంటూ కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్ వివరించారు. తమ ప్రజెంటేషన్ లో రాజకీయంగా చేయలేదన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరాన్ని చెప్పడానికే ఈ ప్రజెంటేషన్‌ ఇచ్చామని చెప్పుకొచ్చారు.

పోలవరం ఆలస్యం వెనుక

పోలవరం ఆలస్యం వెనుక

అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు ఆర్థిక క్రమశిక్షణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి ముందు పార్లమెంట్ లో కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా గురించి గతంలో చెప్పిన అంశాన్నే మరోసారి స్పష్టం చేసింది. హోదా - 14వ ఆర్దిక సంఘం 42 శాతం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంపు- రెవిన్యూ లోటు రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్ల గురించి చెప్పుకొచ్చింది. దీంతో పాటుగా... ఇటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరం - వరదల గురించి రచ్చ జరుగుతున్న సమయంలోనే కేంద్రం పార్లమెంట్ వేదికగా పోలవరం నిర్మాణం పైన ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వ తీరు వలనే ఆలస్యమైనట్లు వెల్లడించింది. రాష్ట్రానికి వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవటమే పోలవరం జాప్యానికి కారణమని స్పష్టం చేసింది. కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ అంశాలను స్పష్టం చేసారు.

కౌంటర్ చేయాలని వైసీపీ నిర్ణయం

కౌంటర్ చేయాలని వైసీపీ నిర్ణయం

పోలవరం ప్రాజెక్టు 2022 ఏప్రిల్‌కు పూర్తి చేయాలనుకున్నా అది సాధ్యం కాలేదని, తాజాగా 2024 జూన్‌ నాటికి పూర్తి చేయనున్నామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన వ్యూహం, ప్రణాళిక లేదని ఆ సమాధానంలో తేల్చి చెప్పారు. సరైన నిర్వహణ ప్రణాళిక లేకపోవడంతోపాటు కొవిడ్‌వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని తేల్చారు. కేంద్రం ఏపీకి సంబంధించిన అంశాల్లో వ్యవహరిస్తున్న తీరు.. శ్రీలంక పైన చర్చల్లో ఏపీని ప్రస్తావించటం.. పోలవరం ఏపీ ప్రభుత్వ అసమర్ధతగా పేర్కొనటం. పైన వైసీపీ సీరియస్ గా ఉంది. వీటి పైన పార్టీలోనూ చర్చ జరిగింది. దీనికి కౌంటర్ ఇవ్వాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయించింది. కేంద్రం చేస్తున్న అప్పులు.. ఎఫ్ఆర్బీఎంలో చేసిన మార్పులు.. రాష్ట్రాలకు నిధుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు పైన స్పష్టత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు ఈ పరిణామాలు కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.

English summary
YSRCP and other some regional parties object to talk on state finances at SriLanka criris meet. later Central given clarity on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X