షాక్: కిరణ్ రెడ్డి ఫ్యామిలీ టార్గెట్, చంద్రబాబు రైట్ హ్యాండ్‌కు జగన్ పార్టీ బంపరాఫర్!
Recommended Video

చిత్తూరు: ఓ వైపు టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతుంటే, కొత్త నీరు కారణంగా అధికార పార్టీలోని అసంతృప్తిని సొమ్ము చేసుకునే పనిలో పడింది వైయస్సార్ కాంగ్రెస్. ఎన్నికలకు మరో ఏడాది, ఏడాదిన్నర ఉన్న ఈ సమయంలో టీడీపీ, వైసీపీలు ఆయా నియోజకవర్గాల్లోని, జిల్లాల్లో తమ వైపు చూస్తున్న నేతలపై దృష్టి సారించారు.
చదవండి: జగన్ తెలుసుకో: పవన్ సూచనలపై బుద్ధా, అనంతపురంలో బాబుకు అలా చెక్ పెట్టే వ్యూహం
చదవండి: నీకంటే బలవంతులే: పవన్ వార్నింగ్‌పై రాధాకృష్ణ, అదే చిరంజీవి చేతకానితనమంటూ!
ఎదుటి పార్టీల్లోని అసంతృప్త నేతలను తమ వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా, చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ ఆఫర్ వచ్చింది మాజీ ఎమ్మల్యే శ్రీనాథ్ రెడ్డికి అని చెబుతున్నారు.
చదవండి: అదే నిదర్శనం: పవన్ కళ్యాణ్ ఆఫర్, చిరంజీవికి జనసేనలో కీలక పదవి?

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బంపరాఫర్ ఇచ్చారని
ఈ విషయాన్ని స్వయంగా శ్రీనాథ్ వెల్లడించారని అంటున్నారు. టీడీపీని వీడి వైసీపీలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తనకు బంపర్ ఆఫర్ ఇచ్చారని, దాంతో పాటు కాంట్రాక్టు పనులకు పోటీ కూడా రామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.

మాజీ సీఎం కిరణ్ రెడ్డి సోదరుడిని ఓడించాలనే
కొద్ది రోజుల క్రితం టీడీపీ కండువా కప్పుకున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో తనను వైసీపీలోకి ఆహ్వానించినట్లు శ్రీనాథ్ రెడ్డి వెల్లడించారు. కిషోర్ కుమార్ రెడ్డి తనను సోదరుడిలా భావిస్తున్నారని, తనను కాదని ఏం చేయడం లేదన్నారు.

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా టీడీపీలోనే
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తి లేదని శ్రీనాథ్ రెడ్డి వెల్లడించారు. తాను ప్రాణం ఉన్నంత వరకు టీడీపీని వీడనని చెప్పారు. విలువలు ఉన్న రాజకీయాలే చేస్తానని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

శ్రీనాథ్ సీఎం కుడిభుజం లాంటివారు
మరో నేత, టీడీపీ జిల్లా అధ్యక్షులు నాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు శ్రీనాథ్ కుడి భుజం లాంటివారని చిత్తూరు జిల్లాలో టీడీపీ బలపడుతోందనే వైసీపీ ఇలా మైండ్‌గేమ్ ఆడుతోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications