వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక జగన్ శాశ్వత హోదాలో - ప్లీనరీ వేదికగా : సిద్దమైన అజెండా - షెడ్యూల్ ఫిక్స్..!!

|
Google Oneindia TeluguNews

వైసీపీ ప్లీనరీ వేదికగా సంచలన నిర్ణయం అమలు కానుంది. వైసీపీ బై లాస్ లో మార్పు ద్వారా ఈ నిర్ణయానికి ఆమోదం లభించనుంది. వైసీపీ ప్లీనరీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. తొలి రోజున సర్వమత ప్రార్దనలతో ప్రారంభం అయ్యే ప్లీనరీ సమావేశాలు... రెండో రోజు సాయంత్రం సీఎం జగన్ ప్రసంగంతో ముగియనున్నాయి. తొలి రోజు ఉదయం సభ్యుల రిజిస్ట్రేషన్ జరగనుంది. ఆ తరువాత పార్టీ అధ్యక్షుడు జగన్ జెండా ఆవిష్కరించనున్నారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళి..సర్వమత ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఆ తరువాత పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం ప్రకటన విడుదల చేయనున్నారు. సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ ప్రకటన చేస్తారు.

పార్టీ అధ్యక్ష హోదా - సవరణ

పార్టీ అధ్యక్ష హోదా - సవరణ

11 గంటలకు పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఆ వెంటనే పార్టీ జమాఖర్చుల ఆడిట్ నివేదిక ప్రతిపాదన, ఆమోదం జరుగుతాయి. ఇక, ఈ సమావేశాల్లో ప్రత్యేకంగా పార్టీ నియమావళి సవరణల ప్రతిపాదన, ఆమోదం చేపట్టనున్నారు. దీని ద్వారా పార్టీ అధ్యక్షుడిగా జగన్ శాశ్వత అధ్యక్షుడి హోదాలో కొనసాగే విధంగా పార్టీ నియమావళి సవరణ చేసి..ప్లీనరీ వేదికగా ఆమోదించేందుకు రంగం సిద్దమైంది. దీని ద్వారా గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ సైతం ఇక శాశ్వత గౌరవాధ్యక్షురాలి హోదాలో కంటిన్యూ కానున్నారు. మొత్తం 9 తీర్మానాలు ఈ రెండు రోజుల సమావేంలో ఆమోదించేలా నిర్ణయించారు. తొలి రోజున పార్టీ కార్యక్రమాల గురించి వివరించారు. ఆ తరువాత తీర్మానాల ప్రతిపాదన ప్రారంభం అవుతుంది.

9 తీర్మానాల ప్రతిపాదన - ఆమోదం

9 తీర్మానాల ప్రతిపాదన - ఆమోదం


మొదటి తీర్మానంగా మహిళా సాధికారత దిశ చట్టం పైన చేపట్టనున్నారు. ఈ తీర్మానం పైన మంత్రులు ఉషశ్రీ చరణ్, రోజా , ఎమ్మెల్సీ పోతుల సునీత, లక్ష్మీపార్వతి, జక్కంపూడి విజయలక్ష్మి ప్రసంగిస్తారు. రెండో అంశం గా విద్య పై తీర్మానం చేపట్టనున్నారు. ఈ తీర్మానం పైన మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సుధాకర్ బాబు, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ప్రసంగిస్తారు. రెండు గంటల 15 నిమిషాల నుంచి ఒక పావు గంట పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:30 కు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పై తీర్మానం ప్రతిపాదన ఉంటుంది. దీని పైన మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, ఎమ్మెల్యేలు కొత్తగుళ్ళి భాగ్యలక్ష్మి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి ప్రసంగాలు ఉంటాయి.

జగన్ ప్రసంగం - కీలక ప్రకటన

జగన్ ప్రసంగం - కీలక ప్రకటన

మూడు గంటల 15 నిమిషాలకు వైద్యం పై తీర్మానం ఉండనుంది. ఇందులో మంత్రులు విడదల రజనీ.. సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని మాట్లాడనున్నారు. సాయంత్రం పరిపాలనా- పారదర్శకత అంశం పై చర్చ చేపట్టనున్నారు. ఈ అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, పార్థసారథి ప్రసంగిస్తారు. దీని ద్వారా తొలి రోజున ప్లీనరీ ముగియనుంది. అయితే, ఈ సారి చేయనున్న పార్టీ ప్లీనరీ లో జగన్ హోదా అధ్యక్షుడు నుంచి శాశ్వత అధ్యక్షుడిగా మారటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీని పైన శనివారం ప్లీనరీ లో అధికారికంగా ప్రకటన ఉండనుంది.

English summary
YSRCP by laws may change for Party president post in plenary meetings, Two day plenary begins on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X