"తొలినుంచి రైతుల పక్షాన నిలబడింది వైఎస్ కుటుంబమే"
అనంతపురం : ఏపీ అధికార పార్టీ టీడీపీ రైతు సమస్యలను గాలికొదిలేసిందని.. తొలి నుంచి వైఎస్ కుటుంబం మాత్రమే రైతుల పక్షాన నిలబడుతోందని అనంతపురంలో జరిగిన రైతు ధర్నా సందర్బంగా పలువురు ప్రముఖ రైతు నాయకులు వెల్లడించారు. నాటి దివంగత సీఎం వైఎస్ లాగే నేటి వైసీపీ అధినేత జగన్ కూడా రైతుల సమస్యలు తీర్చడానికి కృషి చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.

ఇక అధికార టీడీపీ రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందంటూ మండిపడ్డ రైతు నాయకులు.. టీడీపీ నాయకుల్లో అధికార గర్వం చెలరేగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అసలు రైతులను పట్టించుకోవడమే మానేసిందని అసహనం వ్యక్తం చేశారు. కాగా, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం చూపిస్తోన్న అసలత్వ వైఖరిని ఎండగడుతూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగింది వైసీపీ. ఈ కార్యక్రమంలో వైసీపీ అధినేత జగన్ సహా పలువురు జిల్లా నేతలు, మరియు రైతు నాయకులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications