తండ్రేమో అలా.. చిట్టినాయుడేమో ఇలా.. చంద్రబాబు,లోకేష్‌లపై విజయసాయి రెడ్డి విమర్శలు..

Recommended Video

    Vijaysai Reddy Made Satires On Nara Lokesh Declaration Of Family Assets

    మాజీ మంత్రి,టీడీపీ నేత నారా లోకేష్ ఆస్తుల ప్రకటనపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. తండ్రేమో తన ఆస్తి లక్ష కోట్లని వేలమంది సాక్షిగా ప్రకటిస్తే.. చిట్టినాయుడేమో ఆస్తుల వివరాలంటూ.. ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లల్లో దుమ్ము కొడుతాడని ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసింది త్వరలోనే బయటపడుతుందని.. అప్పటిదాకా కాయితాలు భద్రంగా దాచుకో చిట్టి అని విమర్శించారు.

    గురువారం నారా లోకేష్ తమ కుటుంబ ఆస్తులను ప్రకటించిన నేపథ్యంలో.. గతంలో చంద్రబాబు తన ఆస్తి లక్ష కోట్లు అంటూ నోరు జారిన ఘటనను ముడిపెడుతూ విజయసాయి ట్వీట్స్ చేశారు. ఇక మరో ట్వీట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయి రెడ్డి పలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్‌కు పంపిన రూ.400 కోట్లే కాదు,బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నింటికీ చంద్రబాబు నిధులు సమకూర్చాడని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రూ.400 కోట్లు ఖర్చు పెట్టాడని ఆరోపించారు.

    ysrcp rajaysabha member vijayasai reddy satires on nara lokesh over family assets declaration

    అప్పట్లో దీనిపై జాతీయ మీడియాలో పెద్ద చర్చే జరిగిందని.. 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి చెందిన సీఎం దేశం మొత్తానికి ఎలక్షన్ ఫండింగ్ చేశాడని అన్నారు. అంతకుముందు మరో ట్వీట్‌లో చంద్రబాబు తన బినామీ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్దమా అని ప్రశ్నించారు. స్విస్ బ్యాంకు ఖాతాలపై విచారణకు సిద్దమా అని చంద్రబాబు,లోకేష్‌లను నిలదీశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+