వైసీపీ రాజ్యసభ అభ్యర్దులు ఖరారు- టీడీపీ కూటమి నుంచి అనూహ్య ఎంపిక..!!

ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠను పెంచుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఈ రోజు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. వైసీపీ నుంచి ముగ్గురు అభ్యర్దులను ఇప్పటికే పార్టీ ఖరారు చేసింది. టీడీపీ తాజా పొత్తుల వేళ రాజ్యసభ అభ్యర్దిగా తెర పైకి కొత్త పేరు ప్రచారంలోకి వచ్చింది.

రాజ్యసభ ఎన్నికలు
వైసీపీ అసెంబ్లీ అభ్యర్దుల ఎంపిక ఖరారు వేళ ఇచ్చిన హామీలకు అనుగుణంగా రాజ్యసభ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ సీనియర్ నేత వైవీ సబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాధ్ రెడ్డి పేర్లను వైసీపీ ఖాయం చేసింది. చివరి నిమిషంలో మార్పులు ఉంటే మినహా ఈ ముగ్గురు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ముగ్గురిని అసెంబ్లీకి రావాలని పార్టీ సమాచారం ఇచ్చింది. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఎమ్మెల్యేలకు వీరిన పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు గెలుపు కోసం అవసరమైన నెంబర్ తో ఎమ్మెల్యేలను సిద్దం చేస్తున్నారు. టీడీపీ ఎవరిని బరిలోకి దించుతుంది..పోలింగ్ అనివార్యం అయితే ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే అంశం పైన సీనియర్లు కసరత్తు చేస్తున్నారు.

YSRCP Rajyasabha contesting candidates finalised, TDP to field new Candidate for this election

నెంబర్ గేమ్
ప్రస్తుతం శాసనసభలో ఉన్న సంఖ్య బలం ఆధారంగా మూడు సీట్లు వైసీపీ గెలుచుకొనే అవకాశం ఉంది. అయితే, టీడీపీ, జనసేన తాజాగా బీజేపీతో పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ తమ కూటమి నుంచి అభ్యర్దిని బరిలోకి దించాలని భావిస్తోంది. వైసీపీలో సీట్లు రాక టీడీపీ, జనసేనతో టచ్ లోకి వచ్చిన వారు పోలింగ్ వేళ తమకు కలిసి వస్తారనే అంచనాలతో ఉన్నారు. అదే సమయంలో సీట్లు రాక ప్రస్తుతం వైసీపీ లో ఉన్న వారిని తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ప్రస్తుతం టీడీపీ, వైసీపీ నుంచి పార్టీలు మారిన రెబల్స్ పైన స్పీకర్ అనర్హత వేటు వేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే గంటా రాజీనామా ఆమోదించారు. దీంతో..ఓటింగ్ లో పాల్గొనే సభ్యుల సంఖ్య 165కి చేరనుంది. ఇదే జరిగితే రాజ్యసభ ఎన్నికల్లో నెంబర్ గేమ్ ఖాయంగా కనిపిస్తోంది.

దక్కేదెవరికి
ఇక, టీడీపీ ఎన్డీఏలో చేరటం ఖాయమైతే మూడు పార్టీల కూటమి నుంచి అభ్యర్ది పోటీలో ఉంటారని తెలుస్తోంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఒకరిని ఈ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్ది పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఇదే అంశం పైన అమిత్ షా వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. కానీ, అమిత్ షా నుంచి దీనికి సంబంధించి ఇంకా ఆమోదం రాలేదు. పొత్తుల పైన స్పష్టత వచ్చిన తరువాతనే ఆయన పోటీకి లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అదే అభ్యర్ది ఎంపీగానూ పోటీ చేయాలని భావిస్తుండటంలో ఆయన్నే పోటీకి దింపుతారా..బీసీ వర్గాలకు అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. దీంతో..మరో రెండు రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమా...ఎన్నిక జరగాల్సిందేనా.. టీడీపీ కూటమి నుంచి ఎవరు అభ్యర్దిగా ఉంటారు..ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+