ప్రధానితో వైసీపీ ఎంపీల సమావేశం - బీసీ జనగణనపై వినతి..!!
వైసీపీ ఎంపీలు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధానితో సమావేశమైన వైసీపీ ఎంపీలు జనాభా లెక్కలలో బీసీ జనగణన చేయాలని కోరారు. రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి అ మేరకు ప్రధానికి వినతి పత్రం సమర్పించారు. దేశంలో 53 శాతం మంది బీసీలు ఉన్నారని వారు ప్రధానికి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. అయినప్పటికీ బీసీలను ను రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
బీసీ జనగణన చేయాలని.. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నా చట్టసభలో తగిన ప్రాతినిధ్యం లేదన్నారు. ఓబీసీల అభివృద్ధికి, ప్లానింగ్ కోసం ఖచ్చితమైన బీసీ జనాభా లెక్కలు అవసరమని పేర్కొన్నారు. పార్లమెంటు శాసనసభ న్యాయవ్యవస్థలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు ప్రధానిని అభ్యర్ధించారు. ఇదే అంశం పైన గతంలో ఏపీ అసెంబ్లీలోనూ తీర్మానం చేసారు. జనాభా లెక్కల్లో ప్రత్యేకంగా బీసీల గణన చేపట్టాలని కోరుతున్నారు. అయతే కేంద్రం మాత్రం ఈ అంశంపై స్పందించడం లేదు.

బీసీ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు ఏపీ ప్రభుత్వం బీసీ జనగణనకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. బీసీ కులగణన జరిగితే మరింత వెసులుబాటు కలుగుతుందని అందుకే కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేస్తున్నట్లు తీర్మాన సమయంలో సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రధానితో సమావేశమైన సమయంలోనూ వైసీపీ ఎంపీలు అసెంబ్లీ తీర్మానంతో పాటుగా అన్ని అంశాలను ప్రధానికి వివరించారు.












Click it and Unblock the Notifications