Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎమ్మెల్యేల పై అనర్హత వేటు విచారణ వేళ కీలక పరిణామాలు..!!

పార్టీలు మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ల పైన స్పీకర్ విచారణ చేస్తున్నారు. స్వయంగా ఎమ్మెల్యేలను తన కార్యాలయంలో హాజరు కావాలని స్పీకర్ నోటీసులు జారీ చేసారు. దీని పైన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. స్పీకర్ విచారణ నోటీసులు రద్దు చేయాలని కోరారు. తమకు ఇచ్చిన నోటీసుల పైన మెటీరియల్ కావాలని కోరారు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించటంతో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారుతోంది.

వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి, మేకపాటి, శ్రీదేవి టీడీపీలో చేరారు. ఈ నలుగురి పైన అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. వీటి ఆధారంగా తన కార్యాలయంలో ప్రత్యక్ష విచారణకు రావాలని ఈ నలుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసారు. అదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో మేకపాటి చంద్రశేఖర రెడ్డి, శ్రీదేవి స్పీకర్ విచారణకు హాజరయ్యారు. తమకు తమ అభిప్రాయం చెప్పేందుకు మరింత సమయం కావాలని కోరారు.

YSRCP Rebel MLAs house motion lunch petition in High court Against Speaker notices

ఇదే సమయంలో నలుగురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయటం ఆసక్తి కరంగా మారింది. తమ వాదన వినకుండా..తమకు ఎటువంటి మెటీరియల్ ఇవ్వకుండా విచారణకు రావాలంటూ తమకు నోటీసులు జారీ చేసారని ఎమ్మెల్యేలు హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. కోర్టులో విచారణ సమయంలో ఎటువంటి నిర్ణయం వస్తుంది..స్పీకర్ ఎలాంటి అడుగులు వేస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. ఈ సమయంలోనే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు సైతం మండలి ఛైర్మన్ నోటీసులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశామని మండలి ఛైర్మనుకు అడ్వకేట్ ద్వారా లేఖ పంపారు.

లంచ్ మోషన్ పిటిషన్ మధ్యాహ్నాం విచారణకు వస్తున్నందున్న తాను హాజరు కావడానికి నెల రోజుల సమయం కావాలని సి రామచంద్రయ్య కోరారు. ఇటు స్పీకర్ కార్యాలయం..అటు హైకోర్టులో రెబల్ ఎమ్మెల్యేల పిటీషన్లు...విచారణ వేళ ఈ సాయంత్రానికి ఎలాంటి నిర్ణయాలు వస్తాయనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+