వైఎస్ జగన్‌కు రఘురామ లెటర్ నంబర్ 9: నవ ప్రభుత్వ కర్తవ్యాలు టైటిల్‌తో..జర్నలిస్టుల్లో!
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజాగా మరో లేఖ రాశారు. ఆయన రాస్తోన్న లెటర్ల సిరీస్‌లో ఇది తొమ్మిదవది. నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో ఆయన రోజూ ఓ సామాజిక అంశాన్ని, పాదయాత్ర హామీలను గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి ఉత్తరాలను రాస్తూ వస్తోన్నారు. సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్‌ను కల్పించాలంటూ ఆదివారం లేఖ రాసిన రఘురామ.. ఈ సారి జర్నలిస్టుల సంక్షేమంపై గళమెత్తారు.

అక్రిడేషన్లు ఏమయ్యాయ్..
జర్నలిస్టులకు సంబంధించిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చట్లేదని రఘురామ పేర్కొన్నారు. ప్రధానంగా అక్రిడేషన్లను జారీ చేయడంలో నిర్లక్ష్యం తగదని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన అక్రిడేషన్ల కమిటీలో ఒక్క జర్నలిస్ట్‌కు కూడా లేడని పేర్కొన్నారు. ఆ కమిటీని ఎందుకు రద్దు చేశారో తెలియట్లేదని అన్నారు. కొత్త అక్రిడేషన్ల కార్డుల కోసం వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లను అందజేయాలనడం, దీనికి సంబంధించిన ప్యానెల్ నుంచి జర్నలిస్టులను తొలగిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 142ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.

రెండేళ్లుగా అక్రిడేషన్ల జారీలో విపలం..
మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్లను జారీ చేయడంలో తమ ప్రభుత్వం రెండేళ్లుగా విఫలమౌతోందని రఘురామ విమర్శించారు. ఫలితంగా 40 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ కార్డులు లేకపోవడం వల్ల పలు ప్రయోజనాలను వారు కోల్పోతోన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామంటూ పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారని వైఎస్ జగన్‌కు గుర్తు చేశారాయన. జీఎస్టీలో మినహాయింపులు ఇవ్వకపోవడం వల్ల ప్రింట్ మీడియాపై ఖర్చు విపరీతంగా పెరిగిపోతోందని, దాన్ని నివారించాలని డిమాండ్ చేశారు.

కరోనా కుటుంబాలకు ఆర్థిక పరిహారంలో జాప్యం..
కరోన వైరస్ బారిన పడి మరణించిన జర్నలిస్టులు, మీడియా ప్రతినిధుల కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. దాన్ని అందజేయడంలో జాప్యం చేస్తోందని రఘురామ పేర్కొన్నారు. కరోనా వల్ల వందలాది మంది మీడియా ప్రతినిధులు మరణించారని చెప్పారు. ఇదివరకు ప్రతి జర్నలిస్ట్ కూడా 1,200 రూపాయల ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లించేవారని, రెండేళ్లుగా దీనికి సంబంధించిన ప్రభుత్వ వాటా విడుదల కావట్లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని రఘురామ చెప్పారు. అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టును కూడా ఆరోగ్యశ్రీ పరిధి కిందికి తీసుకొచ్చినప్పటికీ.. ఆసుపత్రులు పట్టించుకోవట్లేదని అన్నారు.

ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా..
జర్నలిస్టులందరినీ ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా గుర్తించాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ.. క్షేత్రస్థాయిలో పనిచేస్తోన్నారని పేర్కొన్నారు. వారికి 50 లక్షల రూపాయల బీమాను కల్పించాలని అన్నారు. డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లు, ఇతర మెడికల్ స్టాఫ్ పరిధిలోకి జర్నలిస్టులను కూడా తీసుకుని రావాలని చెప్పారు. రెవెన్యూ, మెడికల్, పోలీసుల తరహాలోనే జర్నలిస్టులను కూడా గుర్తించాలని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కేరళ, ఒడిశా ప్రభుత్వాలు అక్రిడేటెడ్ జర్నలిస్టులకు 10,000 రూపాయల అలవెన్స్‌లను అందజేశాయని గుర్తు చేశారు.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications