ఏపీలో 7 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు ? ఆ ఎంపీ సీటుతో పాటే- రఘురామ తాజా డిమాండ్....
ఏపీలో మరో 9 నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. వీటిలో ఎలాగైనా గెలవాలని వైసీపీ, టీడీపీ పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే ఫిరాయింపుల పర్వం కూడా ఊపందుకుంటోంది. ఇదే క్రమంలో వైసీపీ నుంచి టీడీపీకి, అలాగే టీడీపీ, జనసేన నుంచి వైసీపీకి ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేలు ఫిరాయించిన 7 సీట్లలో ఉపఎన్నికలు పెట్టాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ ఇవాళ డిమాండ్ చేశారు. టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక, పార్టీ నాయకత్వంతో విభేదించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తనకు ప్రాణమిచ్చే శాసనసభాపతి ద్వారా అనర్హత వేటు వేయించి , ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధపడాలని ఆయన కోరారు.

టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఉండవల్లి శ్రీదేవి కాకుండా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ నాయకత్వం, విధానాలు నచ్చక పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని రఘురామ తెలిపారు. టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు, వైసీపీతో విభేదించి బయటకు వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రఘురామ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈ ఏడు స్థానాలకు, రాహుల్ గాంధీ సస్పెన్షన్ తో ఖాళీ అయిన లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికతో పాటే ఎన్నిక నిర్వహించేలా జగన్ చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో ఉప ఎన్నికలు నిర్వహించి, ఈ ఏడు స్థానాలలో వైసీపీ అభ్యర్థులే నెగ్గితే, జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగా 175కు 175 స్థానాలలో గెలుస్తామని భావించవచ్చని రఘురామ తెలిపారు. ఈ ఏడు స్థానాలలో ఓటమిపాలయితే, మాకు ఓట్లు వేసేవారు వేరే ఉన్నారని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాగో రెడీ గానే ఉంటారన్నారు. అయినా 175 స్థానాలలో ఏడు స్థానాలు ఓడిపోతే 168 స్థానాలు మనవే కదా అంటూ రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications