చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన రెబెల్ ఎంపీ రఘురామరాజు!
ఏపీలో జమిలి ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార, విపక్షాలు అభ్యర్ధుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. ఈ సమయంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో భిన్న తీర్పులు రావడంతో అది కాస్తా త్రిసభ్య ధర్మాసనం పరిధిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎన్నికల సమయంలో తీర్పు ఇస్తే, అది ప్రతికూలంగా వస్తే పరిస్ధితి ఏంటన్న ఆందోళన టీడీపీతో పాటు జనసేనలోనూ కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ లాబీల్లో తిరిగే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చంద్రబాబుకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు క్వాష్ పిటిషన్ పై త్రిసభ్య ధర్మాసనం విచారణ, అనంతర పరిణామాలు, టీడీపీ పరిస్ధితిపై ఆయన ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల తర్వాత సొంతూరు భీమవరంలో సంక్రాంతి సంబరాల కోసం వచ్చిన రఘరామరాజు.. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు భరోసా ఇచ్చారు.

Recommended Video

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై భిన్న తీర్పులు రావడం బాధాకరమే అయినా త్రిసభ్య ధర్మాసనంలో ఈ కేసు విచారణ పూర్తయి తీర్పు రావడానికి కనీసం ఆరునెలలు పడుతుందని అంచనా వేస్తున్నట్లు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ వెల్లడించారు.అలాగే సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ లోని సీనియర్ జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు భిన్నంగా జూనియర్ జడ్జి అయిన జస్టిస్ బేలా త్రివేది తీర్పు ఇవ్వడం అరుదైన ఘటన అని రఘురామ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే చంద్రబాబుకు అన్ని కేసుల్లోనూ ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి వచ్చే ఎన్నికలకు ఆయనకు కానీ, టీడీపీకి కానీ వచ్చిన ఇబ్బందేమీ లేదని రఘురామరాజు తెలిపారు. అలాగే సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి చంద్రబాబుకు అనుకూలంగా సెక్షన్ 17ఏ వర్తింపుపై తీర్పు ఇచ్చారు కాబట్టి త్రిసభ్య ధర్మాసనంలోనూ ఇదే తీర్పు రిపీట్ అవుతుందని అనుకుంటున్నట్లు రఘురామ తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు వచ్చే ఎన్నికల సమయంలో ఇబ్బందులు ఉంటాయని తాను అనుకోవడం లేదన్నారు.












Click it and Unblock the Notifications