జగన్ కేబినెట్ ప్రక్షాళన అసాధ్యం-పెద్దిరెడ్డి, బొత్సను తప్పిస్తే పోరు- రఘురామ షాకింగ్ కామెంట్స్
ఏపీలో వైసీపీ అధినేత కమ్ సీఎం జగన్ ఈ ఏడాది చివర్లో కేబినెట్ విస్తరణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత మంత్రులందరికీ ఉద్వాసన పలికి వారి స్దానాల్లో కొత్త మంత్రుల్ని తీసుకునేందుకు భారీ కసరత్తే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి స్ధానం దక్కబోతోందన్న దానిపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రస్తుత మంత్రుల్లో అందరినీ తప్పిస్తారా లేక కొందరినే తప్పిస్తారా అన్న దానిపైనా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.

జగన్ కేబినెట్ విస్తరణ
ఏపీలో వైసీపీ సర్కార్ రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ లో కేబినెట్ విస్తరణకు సీఎం జగన్ ముహుర్తం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో అందరు మంత్రులకు ఉద్వాసన పలుకుతారా లేక ఒకరిద్దరిని మాత్రం కొనసాగిస్తారా అన్న దానిపై సందిగ్ధత మాత్రం వీడడం లేదు. అదే సమయంలో జగన్ కేబినెట్ విస్తరణలో కొత్తగా ఎవరెవరిని తీసుకుంటారనే దానిపైనా ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే ఓసారి ఎంపీల్ని పిలిపించి కొత్త మంత్రులపై అభిప్రాయాలు తీసుకున్న జగన్.. తనకున్న ఇన్ పుట్స్ సాయంతో భారీ కసరత్తే చేస్తున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై భారీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రఘురామ షాకింగ్ కామెంట్స్
జగన్ కేబినెట్ విస్తరణపై వైసీపీ నేతలతో పాటు విపక్షాలు కూడా ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేసుకుంటున్న వేళ .. ఇందులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ రాజు కూడా తలదూర్చారు. మంత్రివర్గ విస్తరణలో జరిగే మార్పులపై ఆయన కూడా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు సీనియర్ మంత్రులకు మంటపుట్టించేలా ఉన్నాయి. అదే సమయంలో కొత్త మంత్రుల ఆశలపై కూడా నీళ్లు జల్లేలా ఉన్నాయి. దీంతో ఇప్పుడు రఘురామ వ్యాఖ్యలపైనా చర్చ జరుగుతోంది.

విస్తరణ సాధ్యం కాదన్న రఘురామ
జగన్ కేబినెట్ విస్తరణకు కసరత్తు చేస్తున్న వేళ దీనిపై స్పందించిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు.. జగన్ కు కేబినెట్ విస్తరణ సాధ్యం కాదన్నారు. మంత్రివర్గాన్ని జగన్ ప్రక్షాళన చేయలేరంటూ రఘురామ వ్యాఖ్యానించారు. ఇందుకు గల కారణాల్ని కూడా రఘురామ బయటపెట్టారు. ప్రస్తుత కేబినెట్లో సీనియర్ మంత్రుల్ని టార్గెట్ చేసేలా ఉన్న రఘురామరాజు వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీలో భారీ చర్చే జరుగుతోంది. అసలు జగన్ కేబినెట్ ప్రక్షాళన చేయలేరని రఘురామ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపేలా ఉన్నాయి.

బొత్స, పెద్దిరెడ్డిని తప్పిస్తే సమస్యలే
ప్రస్తుత కేబినెట్లో సీనియర్ మంత్రులైన బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తప్పిస్తే సీఎం జగన్ కు సమస్యలు తప్పవని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. బొత్స, పెద్దిరెడ్డి మహామహులని, వారిని తప్పిస్తే జగన్ కు సమస్యలుంటాయని రఘురామ తెలిపారు. ఇప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితుడైన పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి సాగనంపుతారా లేదా అనే అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్న వేళ... రఘురామ వ్యాఖ్యలు వైసీపీలో చిచ్చు పెట్టేలా ఉన్నాయి. అదే సమయంలో జగన్ గతంలో చెప్పినట్లుగా 90 శాతం కేబినెట్ మాత్రమే మారుతుందా లేదా వందశాతం మారే అవకాశం ఉందా అన్న దానిపై కొత్త చర్చలు కూడా మొదలయ్యాయి.
-
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications