వైసీపీలో చలనం వచ్చిందబ్బా:పులివెందుల ఎన్నికపై అనూహ్య నిర్ణయం- పరిణామం

Pulivendula ZPTC bypoll results: ఊహించినట్టే- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నెల 12వ తేదీన జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలను కోల్పోయింది వైఎస్ఆర్సీపీ. ఇక్కడ అధికార తెలుగుదేశం పార్టీ పాగా వేసింది.

వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ భారీ విజయాన్ని అందుకుంది. మొత్తం 6,033 ఓట్ల మెజారిటీతో ఆ పార్టీ అభ్యర్థి లతా రెడ్డి ఇక్కడ గెలుపొందారు. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన తుమ్మల హేమంత్ రెడ్డి పరాజయాన్ని చవి చూశారు.

ysrcp-requests-key-information-from-sec-regarding-pulivendula-bypoll

టీడీపీకి 6,716 ఓట్లు పడ్డాయి. వైఎస్ఆర్సీపీకి 683 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ విజయంతో 30 సంవత్సరాల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకున్నట్టయింది. ఈ విజయం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, సవిత హర్షం వ్యక్తం చేశారు.

అటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానంలోనూ ఇదే ఫలితం వెలువడింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని 6,267 ఓట్ల తేడాతో ఓడించారు. కృష్ణారెడ్డి కి 12,505 ఓట్లు పోల్ అయ్యాయి. ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,351 ఓట్లు పడ్డాయి.

పులివెందులలో ఓటమి దెబ్బ వైఎస్ఆర్సీపీపై తీవ్రంగా పడినట్టే కనిపిస్తోంది. ఆ పార్టీ రంగంలోకి దిగింది. పోలింగ్ కేంద్రాల్లో భారీగా అవకతవకలు, అక్రమాలు, రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్.. చోటు చేసుకుందంటూ ఆరోపిస్తూ వచ్చిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది.

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై పూర్తి సమాచారాన్ని తెప్పించుకుంటోంది. ఆ వివరాలన్నింటినీ తమకు అందజేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు లేళ్ళ అప్పిరెడ్డి.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఎస్ఈసీకి లేఖ రాశారు.

ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఇప్పటికే హైకోర్టును, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు ఈ లేఖలో అప్పిరెడ్డి వెల్లడించారు. తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని త్వరగా అందించాలని ఆయన ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.

పోలింగ్ కేంద్రాలు- వాటి పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్, ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన వీడియో రికార్డింగ్, పోలింగ్ సమయంలో జరిగిన వెబ్ కాస్టింగ్ వివరాలను అందించాలని అప్పిరెడ్డి కోరారు. ఎన్నికల్లో పాల్గొన్న పోలింగ్ ఏజెంట్ల పేర్ల జాబితాను కూడా అడిగారు.

అలాగే- పోలింగ్ అధికారి డైరీ, ఫారం 12, ఫారం 32లను కూడా అందజేయాలని అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు. తాము న్యాయపోరాటం చేస్తోన్నామని, విచారణ సందర్భంగా ఈ వివరాలన్నీ కూడా అత్యవసరం అవుతాయని మని ఆయన ఈ లేఖలో స్పష్టంగా పొందుపరిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+