వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

YS Sharmila పార్టీతో వైసీపీకి సంబంధం లేదు- జగన్ చెప్పినా వినలేదు- సజ్జల సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ సోదరి వైఎస్‌ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై వైఎస్సార్సీపీ స్పందించింది. షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు అవకాశాలు, తెలంగాణలో వైసీపీ క్రియాశీలకంగా లేకపోవడంపై ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల పార్టీతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలంగాణపై సీఎం జగన్‌తో పాటు వైసీపీ కూడా స్పష్టమైన అబిప్రాయంతో ఉన్నాయని సజ్జల తెలిపారు. అందుకే అక్కడ పార్టీని ముందుకు తీసుకెళ్లడం లేదన్నారు. షర్మిలపై సజ్జల చేసిన వ్యాఖ్యలు పూర్తి క్లారిటీగా ఉండటంతో పాటు సంచలనాత్మకంగా ఉన్నాయి.

Recommended Video

#YSsharmila వైఎస్ జగన్, షర్మిల మధ్య విబేధాలేం లేవు..భిన్నాభిప్రాయాలు మాత్రమే- సజ్జల
షర్మిల కొత్త పార్టీపై వైసీపీ రియాక్షన్

షర్మిల కొత్త పార్టీపై వైసీపీ రియాక్షన్

తెలంగాణలో సీఎం జగన్ సోదరి వైఎస్‌ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాలపై వైఎస్సార్సీపీ ఇవాళ స్పందించింది. తెలంగాణలో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ షర్మిల కొత్త పార్టీని ఇంకా ప్రకటించలేదంటూనే ఆమె పార్టీ ప్రకటన, దానిపై వైసీపీ వైఖరి వంటి అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. తెలంగాణ విషయంలో వైసీపీ వైఖరి ఇప్పటికీ స్పష్టంగానే ఉందని ఆయన తెలిపారు. షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు తమకు ఇష్టం లేదనే అభిప్రాయం ఆయన మాటల్లో వ్యక్తమైంది.

పార్టీ వద్దని చెప్పినా షర్మిల వినలేదు

పార్టీ వద్దని చెప్పినా షర్మిల వినలేదు

తెలంగాణలో కొత్త పార్టీ కోసం వైఎస్‌ షర్మిల చేస్తున్న ప్రయత్నాలకు తాము అభ్యంతరం తెలిపామని, అయినా తాను వినలేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఏర్పాటు కోసం తాను చేసిన ప్రయత్నాలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా సజ్జల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వైసీపీని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఏపీ ప్రయోజనాలకు భంగం కలుగుతుందనే జగన్‌ భావిస్తున్నట్లు సజ్జల తెలిపారు. అందుకే షర్మిలను కూడా కొత్త పార్టీ వద్దని కోరినట్లు ఆయన వెల్లడించారు. అయనా వినకుండా ఆమె ముందుకు వెళ్తోందని సజ్జల పేర్కొన్నారు. దీంతో జగన్‌ మాట కూడా వినకుండా షర్మిల ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

జగన్ పార్టీ జగన్‌దే, షర్మిల పార్టీ షర్మిలదే

జగన్ పార్టీ జగన్‌దే, షర్మిల పార్టీ షర్మిలదే


తెలంగాణలో వైఎస్‌ షర్మిల ఏర్పాటు చేసే పార్టీకి వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని సజ్జల కుండబద్దలు కొట్టారు. ఆమె ఏర్పాటు చేసే పార్టీకి తమ ఆశీస్సులు ఉండబోవన్నారు. జగన్ పార్టీ జగన్‌దే అని, షర్మిల పార్టీ షర్మిలదే అని సజ్జల వెల్లడించారు. తద్వారా షర్మిల పార్టీకి వైసీపీతో ఎలాంటి లింక్‌ లేదని, ఆమె తన పని తాను చేసుకుపోతుందనే అభిప్రాయాన్ని సజ్జల క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణ విషయంలో జగన్‌కు పూర్తి క్లారిటీ ఉందన్నారు. అందుకే ఆమె ప్రయత్నాలను వ్యతిరేకించినట్లు సజ్జల పరోక్షంగా చెప్పేశారు.

జగన్‌ మాట కూడా వినని షర్మిల ?

జగన్‌ మాట కూడా వినని షర్మిల ?

తెలంగాణలో వైసీపీ యాక్టివ్‌గా ఉంటే ఏపీ ప్రయోజనాలకు భంగమని భావించిన సీఎం జగన్‌ ఆ రాష్ట్రంలో పార్టీని వద్దనుకున్నారని సజ్జల వెల్లడించారు. అదే బాటలో షర్మిలను కూడా రాజకీయంగా అక్కడ యాక్టివ్‌గా ఉండాలని కోరుకోలేదని తెలుస్తోంది. అయినా జగన్ మాట కూడా వినకుండా పార్టీ పెట్టేందుకు షర్మిల ముందుకెళ్తున్నట్లు సజ్జల తన వ్యాఖ్యల ద్వారా చెప్పేశారు. తద్వారా వైఎస్‌ జగన్‌తో సంబంధం లేకుండానే షర్మిల కొత్త పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే చివరిగా సజ్జల షర్మిలతో తమకు ఉన్నవి బిన్నాభిప్రాయాలే కానీ విభేదాలు కాదని చెప్పుకొచ్చారు.

English summary
ysrcp key leader sajjala ramakrishna reddy on tuesday reacts on cm jagan's sister ys sharmila's new party in telangana and says that they have difference of opinion with her and not differences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X