Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పిచ్చి మాటలెందుకు; బద్వేల్ ఉప ఎన్నికలో గెలుస్తామనే దమ్ముందా? పవన్ కళ్యాణ్ కు శ్రీకాంత్ రెడ్డి సవాల్

ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన బద్వేలు ఎన్నికల్లో గెలుస్తామని చెప్పే దమ్ము పవన్ కి ఉందా అంటూ ప్రశ్నించారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని ఎలా నడిపించాలో కూడా చేతకాని పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

 ఉప ఎన్నికలో ఎక్కువ మెజార్టీతో గెలిచేది వైసీపీనే

ఉప ఎన్నికలో ఎక్కువ మెజార్టీతో గెలిచేది వైసీపీనే

బద్వేలు ఉపఎన్నికల్లో గతం కంటే ఎక్కువ మెజారిటీతో వైసీపీ విజయం సాధిస్తుందని ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఈ ఎన్నికతో వైసిపి కంచుకోట బద్వేల్ అని మరోమారు రుజువు కాబోతుందని ఆయన పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ది కోసం ప్రతిసారి కులాల మతాల ప్రస్తావన తీసుకు వస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక, జగన్ పై ద్వేషం, ఈర్ష తో పవన్ మాట్లాడుతున్నాడని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కడుపుమంటకి మందు లేదని ఆయన ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ వి దుర్మార్గపు ఆలోచనలు .. దాడులకు సమాధానం చెప్పు ..

పవన్ కళ్యాణ్ వి దుర్మార్గపు ఆలోచనలు .. దాడులకు సమాధానం చెప్పు ..

పవన్ కళ్యాణ్ తన దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఏమైనా తిట్టొచ్చా? కానీ ఆయనకు మేము సమాధానం చెప్తే దాడులు చేయిస్తారా అంటూ మండిపడ్డారు. మంత్రి పేర్ని నాని కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అంటూ శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడి చేశారని, దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ చంద్రబాబు డైరెక్షన్ లోనే యాక్షన్ చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం టైం వేస్ట్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం టైం వేస్ట్

పవన్ కళ్యాణ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రజల కోసం అందరిని భరిస్తామని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధిక వర్షాల వల్ల రోడ్లు పాడయ్యాయని, త్వరలోనే రోడ్లను మరమ్మత్తులు చేస్తామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్ అంటూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పిచ్చోడు అనాలో... ఇంకా ఏమనాలో అర్థం కావడం లేదని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజా బలం ఉందని, ప్రజాబలం ఉన్నంతవరకు ఎవరెన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరని పేర్కొన్నారు.

Recommended Video

    బండి సంజయ్ పై మండి పడ్డి గులాబి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి!! || Oneindia Telugu
    బద్వేల్ బై పోల్.. కసరత్తు మొదలెట్టిన ప్రధాన పార్టీలు

    బద్వేల్ బై పోల్.. కసరత్తు మొదలెట్టిన ప్రధాన పార్టీలు

    ఇదిలా ఉంటే కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 30వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇక నేడు బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ నేపథ్యంలో బద్వేల్ ఉప ఎన్నికల పోరు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన పార్టీలన్నీ బద్వేలు వైపు ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పటికే ఉప ఎన్నికల్లో వైసిపి దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధకు టికెట్ ఖరారు చేయగా, టిడిపి అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ పేరును చంద్రబాబు ప్రకటించారు. ఇక ఈసారి ఎన్నికల్లో జనసేన ఉప ఎన్నిక బరిలోకి దిగుతుందని చర్చ జరుగుతుంది

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+