వైసీపీ రివర్స్ ఎటాక్ : రియల్ ఫేస్ ఆఫ్ రఘురామరాజు..స్కామ్ స్టర్ : కేంద్ర మంత్రులు..సీఎంలకు ట్యాగ్ చేస్తూ..!!
ఇప్పటి వరకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ఏపీ ప్రభుత్వం పైన వరుసగా లేఖలు రాసారు. సుప్రీం బెయల్ మంజూరు తరువాత ఢిల్లీ చేరిన రఘు రామ రాజు కేంద్ర మంత్రులు...గవర్నర్లు..సీఎంలు..ఎంపీలకు లేఖలు రాసారు. తన పైన రాజద్రోహం కేసు నమోదు చేసి..విచారణ సమయంలో తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ లేఖల్లో పేర్కొన్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రికి ఆయన ఇచ్చిన హామీల అమలు గుర్తు చేస్తూ లేఖలు రాస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ మరో సారి లోక్ సభ స్పీకర్ ను కలిసి రఘురామ పైన అనర్హత వేటు వేయాలని కోరింది.
ఢిల్లీ కేంద్రంగా కొత్త వ్యూహాలు..
ఢిల్లీ కేంద్రంగా ఇలా కొనసాగుతున్న వేళ.. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేసారు. అందులో రియల్ ఫేస్ రఘురాజు అంటూ ఒక వీడియో పోస్టు చేసారు. అందులో రఘురామ రాజు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకపోవటంతో నమోదైన కేసుల వివరాలతో వచ్చిన పత్రికల క్లిప్పింగ్ లు చూపించారు. దీంతో పాటుగా లోక్ సభ సభ్యుల్లో బిగ్గెస్ట్ స్కాం స్టర్ అంటూ ఆ వీడియో ప్రజెంట్ చేసారు. అందులోనే...రఘురామ రాజు వైసీపీ ముఖ్య నేతల పైన విమర్శల సమయంలో ప్రదర్శించిన అభ్యంతరకర హాహభావాలను సైతం వీడియోలో యాడ్ చేసారు.

Any person with iota of self respect must resign & contest rather than cling onto his seat like #ScamsterMPRaghuRaju Shameless MP @nitin_gadkari @nsitharaman @rsprasad @TCGEHLOT @DrSJaishankar @DrRPNishank @PemaKhanduBJP @Naveen_Odisha @mkstalin @IndiaToday pic.twitter.com/IRDI1e3teV
— Ambati Rambabu (@AmbatiRambabu) June 12, 2021
అదే విధంగా.. కేంద్ర మంత్రులు..సీఎంలకు..
దీనిని అంబటి రాంబాబు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ.. నిర్మలా సీతారామన్..రవి శంకర్ ప్రసాద్..డాక్టర్ జయశంకర్ లతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు, అదే విధంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ట్యాగ్ చేసారు. ఆ ట్వీట్ లో... ఆత్మాభిమానం ఉన్న వారు ఎవరైనా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తారు కానీ, అదే సీటు ను పట్టుకొని వేలాడరు..సిగ్గు లేని ఎంపీ స్కామ్ స్టర్ అంటూ పేర్కొన్నారు. ఇప్పటి వరకు రఘురామ రాజు వ్యాఖ్యలకు..రాస్తున్న లేఖల విషయంలో మౌనంగా ఉంటూ వచ్చిన వైసీపీ నేతలు..నేరుగా కేంద్ర మంత్రులకు రఘురామ రాజు స్కామ్ స్టర్ అంటూ ట్వీట్ చేయటం ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ లో కొత్త టర్న్ తీసుకుంది. రఘురామ రాజు బాటలోనే ముందుకెళ్లాలని వైసీపీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications