నంద్యాల ఎఫెక్ట్: వైఎస్ ఫ్యామిలీ క్యాంపెయిన్, పీకే వ్యూహమిదే!
హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన ఘటన తర్వాత ప్రశాంత్‌కిషోర్‌పై మరింత బాధ్యత పెరిగింది. వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపేందుకుగాను వైఎస్ ఫ్యామిలీ పేరుతో త్వరలోనే వైసీపీ కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రశాంత్‌కిషోర్ రూపొందించారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడం వైసీపీని తీవ్ర ఇబ్బందుల్లో నెట్టింది. అయితే టిడిపి ఊహించిన దాని కంటే భారీ మెజారిటీతో విజయం సాధించడంతో వైసీపీ నేతలు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
అయితే ఇదే అదనుగా భావించిన టిడిపి నాయకత్వం కూడ వైసీపీలో వలసలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది. కొందరు వైసీపీ నేతలు నేరుగా టిడిపి శిబిరంలోకి చేరేందుకు సిద్దమౌతున్నారనే ప్రచారం సాగుతోంది.
అయితే అదే సమయంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకుగాను వైసీపీ చీఫ్ జగన్ పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. పాదయాత్ర కంటే ముందుగా వైసీపీ శ్రేణులను సన్నద్దం చేసే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

ప్రశాంత్‌కిషోర్ అసలు పని ప్రారంభమైంది
ఈ ఏడాది సెప్టెంబర్ 2వ, తేది నుండి వైఎస్ ఫ్యామిలీ పేరుతో ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని వైసీపీ ప్రారంభించనుంది. గతంలో టిడిపి కూడ ''బ్రింగ్ బ్యాక్ బాబు'' పేరుతో క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం టిడిపికి కలిసివచ్చిందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది.ఇదే తరహలో క్యాంపెయిన్‌ను వైసీపీ వైఎస్ ఫ్యామిలీ పేరుతో నిర్వహించనుంది.

పోలింగ్‌బూత్ స్థాయి వరకు పార్టీ కమిటీలు
ప్రతి పోలింగ్‌బూత్ స్థాయి వరకు పార్టీ కమిటీలను తీసుకెళ్ళాలని వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ అనుసరించిన విదానాల కారణంగా ప్రజలు ఏ రకంగా ప్రయోజనం పొందారో, వైఎస్‌ను అభిమానించే కుటుంబాల నుండి వైఎస్ కుటుంబం పట్ల సదభిప్రాయం ఉన్న కుటుంబాల నుండి సమాచారాన్ని సేకరించనున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై ఫోకస్
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోకస్ చేయనుంది పీకే టీమ్. వైసీపీ చీఫ్ ప్రకటించిన నవరత్నాలు, ఇతరత్రా వివరాలను వైఎస్ ఫ్యామిలీతో షేర్ చేస్తారు. పార్టీ విధానాల పట్ల ప్రజల నుండి సమాచారాన్ని సేకరించి అవసరమైన మార్పులపై వైసీపీ నాయకత్వానికి సూచనలను ఇవ్వనున్నారు.

సోషల్ మీడియాలో అనుకూల ప్రచారం
సోషల్ మీడియాలో వైసీపీ విధానాలకు అనుగుణంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించడం వంటి కార్యక్రమాలను పీకే టీమ్ చేస్తోంది. మీడియా క్యాంపెయిన్ నిర్వహించడం... జనంలోకి వెళ్ళే నినాదాలు, వివరాలను ప్రచారాల కోసం రూపొందించడం వంటి కార్యక్రమాలకు పీకే టీమ్ నిర్వహించనుంది.ఎప్పటికప్పుడు వివిధస్థాయిల్లో సర్వేలు చేయిస్తూ పార్టీ బలాలు, బలహీనతలపై ఫోకస్ చేయనుంది.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications