ఇది నా పుట్టిల్లు: జగన్‌పై అభిమానాన్ని బయట పెట్టుకున్న వైఎస్ షర్మిల
YS Sharmila: ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవాన్ని కల్పించే దిశగా పీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిల.. కసరత్తు సాగిస్తోన్నారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేస్తోన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్‌కు ఊపిరి పోసే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇందులో భాగంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు షర్మిల. శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఒంగోలు, తిరుపతిలో సభలను నిర్వహించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పార్టీ నాయకులో సమావేశం అయ్యారు. ఆదివారం అనంతపురంలో పర్యటించారు.

పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. అనంతపురం జిల్లాను తన పుట్టిల్లుగా అభివర్ణించారు షర్మిల. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఈ జిల్లాతో ఉన్న అనుబంధాన్నీ గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ఈ జిల్లా నుంచే ప్రారంభించారని పేర్కొన్నారు.
మాజీ మంత్రి రఘువీరారెడ్డి చేపట్టిన ప్రాజెక్టు అనంతను తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ రెండు పార్టీల హయాంలో అనంతపురం జిల్లా అభివృద్ధికి దూరమైందని మండిపడ్డారు. టీడీపీ- వైసీపీ.. బీజేపీకి బానిసలుగా మారాయని ధ్వజమెత్తారు.

హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే 6.50 లక్షల ఎకరాలకు నీటి సౌకర్యం అందేదని పేర్కొన్నారు. హంద్రీనీవా పనులను 90 శాతం మేర వైఎస్సార్ పూర్తి చేశారని, మిగిలిన పనులను పూర్తి చేయలేక వైఎస్ జగన్ చేతులెత్తేశాడని విమర్శించారు. హంద్రీనీవా కోసం గతంలో జగన్ జల దీక్ష కూడా చేశారని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో దీన్ని పూర్తి చేస్తాననే హామీని మరిచాడని అన్నారు.
#Jagan Fan - జగనన్నను చాలా మోసం చేసావ్ అక్క.#YSSharmila Reaction 👇 pic.twitter.com/3JED6Iws6m
— Daily Culture (@DailyCultureYT) January 28, 2024
తన సమావేశాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణమైన షర్మిల్ కారును వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. జై జగన్ అంటూ నినదించారు. వారితో నవ్వుతూ మాట్లాడారు షర్మిల. జగన్ పేరును పచ్చబొట్టుగా వేసుకున్నానంటూ ఓ అభిమాని చెప్పగా.. గుడ్ అంటూ బదులిచ్చారు. జగన్ అంటే తనకూ ఎంతో ఇష్టమని అన్నారు. ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications