Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతి ఉద్యమంలోకి వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ? టార్గెట్ ఇదే.. !

అమరావతి : ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, అందులో వెలువడిన ఫలితాలు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల్ని అనూహ్యంగా మార్చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఫోకస్ లో లేని ఓ నలుగురు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చేశారు. అంతేకాదు వైసీపీని ధిక్కరించి టీడీపీ అభ్యర్ధులకు క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరంతా సస్పెన్షన్ తర్వాత ఒక్కొక్కరుగా వైసీపీపై కత్తులు దూస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ వైసీపీ నుంచి సస్పెండైన వారిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. వీరిలో కనీసం ఇద్దరు ఇప్పుడు తమ భవిష్యత్ వ్యూహాల్ని పదునుపెడుతున్నారు. ఏదో ఒక అజెండాతో జనంలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరో ఇద్దరు మాత్రం ప్రస్తుతానికి వైసీపీపై విమర్శలు చేస్తున్నా, తమ భవిష్యత్తుపై మాత్రం సైలెంట్ గా కనిపిస్తున్నారు.

ysrcp suspended mlas undavalli sridevi and kotamreddy sridhar reddy to join amaravati movement soon

వైసీపీ నుంచి సస్పెండైన నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు అమరావతి దిశగా కదులుతున్నారు. అమరావతి స్ధానిక ఎమ్మెల్యే అయి ఉండీ ఇన్నాళ్లూ వైసీపీ చెప్పినట్లు విని స్ధానికంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న ఉండవల్లి శ్రీదేవి ఇప్పుడు సస్పెండ్ కాగానే అమరావతి జపం మొదలుపెట్టేశారు. స్ధానికులతో కలిసి అమరావతిపై ఉద్యమించేందుకు సిద్ధమని నిన్న హైదరాబాద్ లో ఆమె స్పష్టమైన ప్రకటనే చేశారు. అంతేకాదు జై అమరావతి నినాదాలు కూడా చేశారు.

అటు అమరావతి ఉద్యమకారులతో గతం నుంచీ సత్సంబంధాలు ఉన్న మరో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇప్పుడు పూర్తిస్ధాయిలో ఉద్యమానికి మద్దతిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో అమరావతి రైతులు న్యాయస్ధానం టూ దేవస్ధానం పేరుతో తిరుమలకు యాత్ర చేస్తున్న సందర్భంలో తన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వారిని కలిసిన కోటంరెడ్డి.. వారికి కావాల్సిన సదుపాయాలు అందించారు. అప్పటినుంచే వైసీపీ అధిష్టానానికి ఆయన చేదుగుళికగా మారారు. ఇప్పుడు సస్పెన్షన్ నేపథ్యంలో త్వరలో ఉండవల్లి శ్రీదేవితో పాటు కోటంరెడ్డి కూడా అమరావతికి మద్దతుగా రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. రాజధానిలో ఇప్పటికే టీడీపీకి అనుకూలంగా ఉన్నపరిస్ధితుల్ని సద్వినియోగం చేసుకుంటూ ఓట్ల పోలరైజేషన్ కు వీరు ప్రయత్నించే అవకాశాలున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+