ఏపీలో ఎవరి హయాంలో అప్పులెక్కువ - పురందేశ్వరి ఆరోపణల వెనుక..!!

ఏపీ ప్రభుత్వం పైన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపణలు చేసారు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. ఈ ఆరోపణల పైన ప్రభుత్వం స్పందించింది. పురందేశ్వరి ఆరోపణల కు సమాధానం ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయం నుంచి ఎవరి హయాంలో ఏ మేర అప్పు చేసారనే లెక్కలు బయట పెట్టింది. సంక్షేమం పేరుతో పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం..ఆర్దిక నిర్వహణ పైన క్లారిటీ ఇచ్చింది.

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పలు లెక్కలను ప్రస్తావించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు : 97,000 కోట్లు గా పేర్కొన్నారు. 2019 మార్చ్ 31 నాటికి, చంద్రబాబు దిగిపోయేనాటికి ఏపీ మీద ఉన్న అప్పు రూ 3,62,375 కోట్లు గా చెప్పుకొచ్చారు. అంటే ఐదేళ్ళలో చంద్రబాబు చేసిన అప్పు రూ 2,65, 365 కోట్లు గా వివరించారు. ఆ తరువాత వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగా 18 జులై 2023 నాటికీ ఏపీ అప్పు రూ 10,77,006 కోట్లు గా విశ్లేషించారు. దీని ద్వారా వైసిపి చేసిన అప్పు రూ 7,14,631 కోట్లు గా వివరించారు. దీని పైన వైసీపీ ప్రభుత్వంలోని ముఖ్యులు స్పందించారు. వాస్తవాలు ఏంటనే చెప్పే ప్రయత్నం చేసారు.

purandeshwari1

అందులో భాగంగా..రాష్ట్ర విభజననాటికి ఉన్న అప్పు రూ 1,32,079 కోట్లు గా చెప్పుకొచ్చారు. టిడిపి దిగిపోయేనాటికి రాష్టం అప్పులు రూ 3,,31,054 కోట్లు (వార్షిక పెరుగుదల 20. 17 శాతం )గా చెబుతున్నారు. 2023 మార్చ్ నాటికి ఏపీ అప్పులు : 5,87,317 కోట్లు ( 16. 13 శాతం )గా నిర్దారించారు. అదే విధంగా.. రాష్ట్ర విభజననాటికి ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు : 1,53, 346 కోట్లు గా వెల్లడించారు. టిడిపి దిగిపోయేనాటికి ఉన్న అప్పులు రూ 4,12,288 కోట్లు ( వార్షిక పెరుగుదల 21. 87 శాతం) గా వివరించారు. దీంతో 2023 మార్చి నాటికి అప్పులు రూ 6,51,789 కోట్లు గా నిర్దారించారు. టీడీపీ పాలనతో పోలిస్తే సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు తక్కువే అని కాగ్ చెబుతోంది. అదే సమయంలో మూలధన వ్యయం చాలా ఎక్కువ అని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోంది.

చంద్రబాబు హయాంలో ఐదేళ్ళలో రూ. 76,139 కోట్లు ఖర్చు చేశారు.. అంటే సరాసరి ఏడాదికి రూ.15,225 కోట్లు కాగా సీఎం వైయస్ జగన్ వచ్చాక నాలుగేళ్లలోనే రూ.75,411 కోట్లు ఖర్చు చేశారు. అంటే సరాసరి ఏడాదికి రూ.18,852 కోట్లు .. సామాజిక ఆస్తుల పెంపునకు ఖర్చు చేసినట్లు లెక్కగా విశ్లేషించారు. అదే విధంగా రోడ్ల కోసం చంద్రబాబు హయాంలో చేసిన ఖర్చు రూ.3,160 కోట్లు కాగా, సీఎం జగన్ వచ్చాక నాలుగేళ్లలో రోడ్లకు పెట్టిన ఖర్చు : రూ.4,493 కోట్లుగా ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఉద్యోగలకు జీతాల అంశం పైన క్లారిటీ ఇచ్చారు. బిజెపి పాలనలోని మధ్యప్రదేశ్ జీతాల బిల్లు : రూ.23,997 కోట్లు ( 2021-22 ఏప్రిల్ - అక్టోబర్ వరకు ) కాగా, గుజరాత్ : రూ.7,789 కోట్లు ఖర్చు చేస్తోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ జీతాల బిల్లు రూ 24, 681 కోట్లు గా ఉంది.

purandeshwari2

2018-19లో ఉద్యోగుల జీతాలు,పెన్షన్ల చెల్లింపులకు రూ.53,811 కోట్లు ఖర్చు కాగా, 2020-21లో ఉద్యోగుల జీతాలు,పెన్షన్ల చెల్లింపులకు రూ.66,470 కోట్లు ఖర్చు చేసారు. చంద్రబాబు ప్రభుత్వం బకాయి పడ్డ జెన్- కో బిల్లులు, కాంట్రాక్టర్ల బిల్లుల వంటివి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ప్రజలకు వివిధ పథకాల ద్వారా నేరుగా రూ.2.20 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లోకి జమచేశారు. కరోనా వంటి కష్టకాలంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గినా ఏక్కడా ఏ పథకమూ ఆగలేదు.. ఏ వర్గమూ ఇబ్బంది పడలేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇవన్నీ పురందేశ్వరికి తెలియదా అని ప్రభుత్వంలోని ముఖ్యులు ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+