ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు- ఈసీకి వైసీపీ, టీడీపీ ఫిర్యాదులివే..!

ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఓటర్ల తుది జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల ప్రక్రియ సాగిస్తోంది. దీంతో పాటు రెండు రోజులుగా రాష్ట్రంలో ఈసీ అధికారులు పర్యటించడంతో పాటు అధికారులు, రాజకీయ పార్టీలతో వరుస భేటీలు
నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సాధ్యమైనంత పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ఈసీ ప్రయత్నాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతలు పరస్పరం ఫిర్యాదులతో హోరెత్తిస్తున్నారు. ఓటర్ల జాబితాల్లో నకిలీ ఓట్లు, ఓట్ల తొలగింపు, తెలంగాణ-ఏపీలో ఓట్లు కలిగి ఉండటం వంటి ఫిర్యాదుల్ని ఈసీ ముందు ఇరు పార్టీలు ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై తగు చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు వారికి హామీ ఇచ్చి పంపుతున్నారు. ఇవాళ కూడా ఈ ఫిర్యాదుల పరంపర కొనసాగింది.

ysrcp, tdp complains ec against each other on electoral rolls irregularities-here is who said what?

గంపగుత్తగా ఫామ్ 7 దరఖాస్తులు ఇవ్వడం, ఒకే వ్యక్తి 100 ఓట్ల తొలగింపుకు దరఖాస్తులు చేయడంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. చంద్రగిరి, పర్చూరు, కాకినాడ, వినుకొండ లాంటి 7 నియోజకవర్గాల్లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటించాలని కోరామన్నారు. ఏపీకి జగనన్న ఎందుకు కావాలి ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొనని బీఎల్వోలకు మెమోలు ఇచ్చిన విషయం కూడా తెలిపారు.
అధికారులు కులసంఘాల మీటింగ్ లకు వెళ్తున్న అంశంపైనా ఫిర్యాదు చేశామన్నారు.

మరోవైపు టీడీపీ-జనసేన కలిసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వైసీపీ ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా ఇంటింటికెళ్లి ప్రలోభాలకు గురి చేస్తుందని ఫిర్యాదు చేశారు.తెలంగాణ లో ఉన్న ఓటర్లు ఇక్కడ కూడా ఓటు కలిగి ఉండటాన్ని పరిశీలించాలని కోరామన్నారు. తెలంగాణ లో ఓటు ఉండగా ఏపీలో ఓటు నమోదు చేసుకుంటున్న విషయాన్ని ఈసీఐ దృష్టికి తీసుకెళ్ళామన్నారు.

టీడీపీకి చెందిన కోనేరు సురేష్ అనే వ్యక్తి దురుద్దేశంతో తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని పేర్ని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదనే ఉద్దేశంతో తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారన్నారు. కోనేరు సురేష్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. టీడీపీకి చెందిన మై పార్టీ డాష్ బోర్డులో ఓటర్ల వ్యక్తిగత సమాచారం అంతా ఉంటుందని,టీడీపీ మేనిఫెస్టో ప్రచారం తో చంద్రబాబు సంతకం తో లెటర్లు ఇస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళామని పేర్ని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+