Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో జాబ్ మేళాకు సిద్ధమైన వైసీపీ-ఈసారి నాగార్జున వర్సిటీలో-మే 7,8 తేదీల్లో

ఏపీలో వైసీపీ తరఫున వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్న జగన్ సర్కార్ ఇప్పుడు వరుసగా మూడో మేళాకు సిద్ధమైంది. ఇప్పటికే తిరుపతి, వైజాగ్ లో రెండు ప్రాంతీయ జాబ్ మేళాల్ని విజయవంతంగా నిర్వహించిన వైసీపీ.. ఇఫ్పుడు గుంటూరులో మూడో ప్రాంతీయ జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. దీని వివరాలను ఇవాళ ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.

గుంటూరులో మే నెల 7,8 తేదీల్లో ఈ జాబ్ మేళా నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇందుకోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. జగన్‌ ఆదేశాల మేరకు ఇప్పటికే తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహించిన జాబ్‌మేళాలు గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యాయని, ఇప్పుడు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మే 7, 8న మూడో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని సాయిరెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

ysrcp to organise third job mela in guntur nagarjuna university on may 7,8

మూడు జాబ్‌మేళాల్లో (తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు)మొత్తం 15 వేల ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అయితే తొలి రెండు కార్యక్రమాల్లోనే ఆ లక్ష్యాన్ని మించి, 30 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించే జాబ్‌మేళా కూడా గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుందని భావిస్తున్నట్లు సాయిరెడ్డి తెలిపారు. ఆ కార్యక్రమానికి 208 కంపెనీలు రిజిస్టర్‌ చేసుకున్నాయన్నారు. జాబ్‌మేళాల్లో ఉద్యోగాలు పొందిన వారి కనీస వేతనం రూ.15 వేలు కాగా, గరిష్ట వేతనం లక్షకు పైనే ఉందని సాయిరెడ్డి తెలిపారు. ఐటీ రంగంలోనూ అత్యధిక ఉద్యోగాలు లభిస్తున్నాయని విపక్షాలకు గుర్తుచేశారు.

ఆచార్య నాగార్జున యూనివర్శటీలో నిర్వహించే బాజ్‌మేళాకు ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.ఇప్పటికే ఈ జాబ్‌మేళాకు 77వేల మంది నిరుద్యోగులు రిజిస్టర్‌ చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ నిరుద్యోగిగా మిగలకూడదని అంత వరకు ఈ జాబ్‌ మేళా కార్యక్రమం కొనసాగించాలని సీఎం జగన్‌ ఆదేశించారని సాయిరెడ్డి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+