ఎన్టీఆర్-కృష్ణకు పోలిక పెట్టిన పవన్- వైసీపీ రచ్చ రచ్చ! జనసేన కౌంటర్లు !
ఏపీలో ఎన్నికల ప్రచారం పతాకస్దాయికి చేరుకుంది. దాంతో పాటే కొత్త కొత్త వివాదాలు కూడా తెరపైకి వచ్చేస్తున్నాయి. తాజాగా రాజానగరం వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్... టాలీవుడ్ దిగ్గజాలు ఎన్టీఆర్, కృష్ణ మధ్య అన్యాపదేశంగా తెచ్చిన పోలిక ఇప్పడు వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా పవన్ వ్యాఖ్యల్ని వైరల్ చేస్తూ అధికార వైసీపీ రచ్చ రచ్చ చేస్తుండగా.. జనసేన శ్రేణులు దానికి కౌంటర్లు ఇస్తున్నాయి.
ఏపీలో విపక్షాలను, ముఖ్యంగా తనను విమర్శించే వారిని సీఎం జగన్ టార్గెట్ చేస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ రాజానగరంలో చేసిన ప్రసంగంలో తీవ్ర అభ్యంతరం తెలిపారు. గతంలో ఎన్టీఆర్ వంటి వారు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ వంటి వారు ఎన్ని విమర్శలు చేసినా వారిని ఎన్టీఆర్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని, అది ఆయన సంస్కారమని పవన్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి.

జగన్ ను టార్గెట్ చేసే క్రమంలో పవన్ తెచ్చిన పోలికను వైసీపీ ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తోంది. అంటే ఎన్టీఆర్ సంస్కారవంతుడు, కృష్ణ కాదా అంటూ సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కృష్ణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను అందరూ ఖండించాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన మహేష్ బాబు అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ పై మండిపడుతున్నారు. కృష్ణ లాంటి అందరి మనిషిని పవన్ ఎలా సంస్కారం లేదని అంటారని ప్రశ్నిస్తున్నారు.
వంగవీటి రంగా గారి హత్య గురించి ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని సూపర్ స్టార్ కృష్ణ గారు ప్రశ్నిస్తే.. దాన్ని కూడా నువ్వు ఈరోజు రాజకీయం కోసం వాడుకుంటూ కృష్ణ గారిని అవమానిస్తావా?
— YS Jagan Trends ™ Siddham (@YSJaganTrends) April 21, 2024
వ్యక్తిత్వం, హుందాతనంలో కృష్ణ గారి కాలిగోటికి కూడా నువ్వు సరిపోవు పవన్ కళ్యాణ్! pic.twitter.com/pXQVjeju41
వైసీపీ విమర్శలపై జనసేన నేతలు కౌంటర్లు వేస్తున్నారు. పవన్ ఎన్టీఆర్ కు సంస్కారం ఉందని చెప్పినంత మాత్రాన కృష్ణకు లేదని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ - నందమూరి తారకరామారావు గారి లాంటి వారు చేసిన హుందా రాజకీయాల నుండి నేర్చుకోవాల్సింది పోయి వారి కుటుంబాలపై కక్ష కట్టాడు జగన్, ఇలాంటి ఎన్నో నీతిమాలిన పనులు చేసిన జగన్ ను తరిమేయాల్సిన బాధ్యత కేవలం కృష్ణ, ఎన్టీఆర్ గారి అభిమానులపైనే కాదు, ప్రతీ సినీ హీరో అభిమానిపై ఉందని జనసేన పార్టీ పోస్టు చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ - నందమూరి తారకరామారావు గారి లాంటి వారు చేసిన హుందా రాజకీయాల నుండి నేర్చుకోవాల్సింది పోయి వారి కుటుంబాలపై కక్ష కట్టాడు జగన్.
— JanaSena Party (@JanaSenaParty) April 22, 2024
ఇలాంటి ఎన్నో నీతిమాలిన పనులు చేసిన జగన్ ను తరిమేయాల్సిన బాధ్యత కేవలం కృష్ణ, ఎన్టీఆర్ గారి అభిమానులపైనే కాదు, ప్రతీ సినీ హీరో అభిమానిపై… pic.twitter.com/ZmmKpIdWQ3












Click it and Unblock the Notifications