"ఎన్టీఆర్ మావాడే"-విజయవాడలో వైసీపీ వర్సెస్ టీడీపీ ఫ్లెక్సీవార్, ఉద్రిక్తతలు..

ఏపీలో ఎన్టీఆర్ వారసత్వంపై వైసీపీ, టీడీపీ మధ్య నెలకొన్న పోరు విజయవాడలో మరోసారి ఉద్రిక్తతలకు కారణమైంది. నిన్న రాత్రి పటమటలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వైసీపీ నేత దేవినేని అవినాష్ బ్యానర్లు కట్టారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు వాటి చుట్టూ పసుపు బ్యానర్లు కట్టారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు అవినాష్, గద్దె రామ్మోహన్ మధ్య మాటలయుద్ధం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ ఎవరికి సొంతం అనే విషయంలో ఇరు పార్టీల నేతలు తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు.

నిన్న రాత్రి విజయవాడలోని పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వైసీపీ, టీడీపీ పోటాపోటీ ఫ్లెక్సీలు కట్టుకోవడం, ఇరు పార్టీల ఫ్లెక్సీలపైనా ఎన్టీఆర్ ఫొటోలు ఉండటంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ స్ధానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవినేని నెహ్రూకు యన్టీఆర్‌ తో అనుబంధం ఉన్న మాట వాస్తవమన్నారు.
నెహ్రూ పసుపు జెండా పార్టీవ దేహం మీద కప్పించుకున్నారని, చంద్రబాబు అనాడు స్వయంగా పార్టీ జెండా కప్పారని గద్దె తెలిపారు.

 devineniavinash-

నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ చర్యల్ని ఖండిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే గద్దె తెలిపారు. యన్టీఆర్‌ స్థాపించిన పార్టీ కార్యాలయం పై దాడి చేయించారని, పార్టీ జెండాను కింద వేసి తొక్కారని విమర్శించారు. యూనివర్శిటీ కి యన్టీఆర్‌ పేరు తొలగిస్తే అవినాష్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టిడిపి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగే యన్టీఆర్‌ విగ్రహం వద్ద వారి ఫ్లెక్స్ లు ఏంటని నిలదీశారు. ధన బలం, రౌడీయిజంతో ఏమైనా చేయచ్చంటే.. తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. విజయవాడ లో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కలుషితం‌ చేయొద్దన్నారు. పోలీసు అధికారులు కు‌ చెప్పినా .. మా వల్ల కాదని చేతులేత్తేశారని గద్దె పేర్కొన్నారు.

దీనికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అవినాష్ కూడా ఘాటు కౌంటర్ ఇచ్చారు. తామూ ఎన్టీఆర్ అభిమానులమే అన్నారు. ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే హక్కు తమకుందన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి ఎవరూ రాసివ్వలేదని, అది వాళ్ల పార్టీ ఆఫీసా అని ప్రశ్నించారు.తాము బ్యానర్లు కట్టే వరకూ అక్కడ ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే వారే లేరన్నారు. వారి ప్రవర్తన చాలా బాధగా అనిపించిందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కవ్వింపు చర్యలకు పాల్పడి తమపై నిందలు మోపుతున్నాడని ఆరోపించారు ధనబలం,ఎల్లో మీడియా ఉందని ప్రజలను రెచ్చగొట్టాలని చూడటం సరికాదన్నారు. కవ్వింపు చర్యలు... అల్లర్లను ప్రోత్సహించే విధానం మానుకోవాలని గద్దెని అవినాష్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+