కుప్పంలో చంద్రబాబుకు వైసీపీ నిరసన సెగ-రాళ్లదాడులతో లాఠీఛార్జ్-పోలీసుల తీరుపై విమర్శలు

కుప్పంలో చంద్రబాబు మూడు రోజుల టూర్ ఉద్రిక్తంగా మారుతోంది. చంద్రబాబు టూర్ లో వైసీపీ కార్యకర్తలు ప్రవేశించి పార్టీ జెండాలతో నిరసనకు దిగడంతో ఇరువర్గాల మధ్య బాహాబాహీ చోటు చేసుకుంది. దీన్ని నియంత్రించేందుకు పోలీసులు ఇరువర్గాలపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. దీంతో ఇరువర్గాలకూ స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఇవాళ చంద్రబాబు రెండో రోజు టూర్ లోనూ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

కుప్పంలో చంద్రబాబు టూర్

కుప్పంలో చంద్రబాబు టూర్

మాజీ సీఎం, విపక్ష నేత చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో మూడు రోజులటూర్ ను నిన్న ప్రారంభించారు. ఇప్పటికే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసీపీ గెలుపుతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని సైతం ఓడిస్తామంటూ అధికార పార్టీ హెచ్చరికలు చేస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్దాయిలో క్యాడర్ ను కాపాడుకునేందుకు చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. వైసీపీ కార్యకర్తలు, పోలీసులు కుమ్మక్కై టీడీపీ నేతల్ని కేసులతో బెదిరిస్తున్నారని, వారి రౌడీయిజం ఎంతోకాలం సాగదని నిన్న చంద్రబాబు హెచ్చరించారు. అనంతరం వైసీపీ కార్యకర్తలు రంగంలోకి దిగారు.

చంద్రబాబుకు వైసీపీ సెగ

చంద్రబాబుకు వైసీపీ సెగ

చంద్రబాబు టూర్ లో భాగంగా రామకుప్పంలో పర్యటించిన తర్వాత రోడ్ షోలో ప్రసంగిస్తుండగా.. వైసీపీ కార్యకర్తలు అడ్డుతగిలారు. వైసీపీ జెండాలు పట్టుకుని చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. చంద్రబాబు టూర్ లో వైసీపీ గలాటా సృష్టించడంతో టీడీపీ కార్యకర్తలు కూడా ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగినా పరిస్ధితి అదుపులోకి రాలేదు. చివరికి పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది.

 పోలీసుల లాఠీఛార్జ్

పోలీసుల లాఠీఛార్జ్

కొంగనపల్లిలో చంద్రబాబు టూర్ ఉందని తెలుసుకుని స్ధానిక వైసీపీ నేతలు తమ పార్టీ జెండాల్ని, తోరణాల్ని అక్కడ కట్టారు. చంద్రబాబు అక్కడికి రాగానే వైసీపీ కార్యకర్తలు జెండాలు ప్రదర్శిస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య వాగ్వాదం, ఘర్షణ పెరిగి రాళ్ల దాడి చేసుకునే పరిస్ధితులు తలెత్తాయి. పోలీసులు వీరిని అడ్డుకునేందుకు లాఠీఛార్జ్ చేయడంతో ఇరువర్గాలకూ గాయాలయ్యాయి. మధ్యలో వెళ్లిన ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లకూ గాయాలయ్యాయి. చివరికి వైసీపీ కార్యకర్తల్ని ఓ ఇంట్లో పెట్టి తాళం వేసి చంద్రబాబు టూర్ కొనసాగేందుకు పోలీసులు సహకరించారు.

 పోలీసుల తీరుపై చంద్రబాబు ఫైర్

పోలీసుల తీరుపై చంద్రబాబు ఫైర్

స్ధానికంగా 70 మంది పోలీసులు తన పర్యటనలో బందోబస్తులో ఉన్నప్పటికీ 20 మంది వైసీపీ కార్యకర్తల్ని అదుపు చేయలేకపోయారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గంలో తనకు భద్రత కల్పించలేని పరిస్ధితుల్లో పోలీసులు ఉన్నారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న తనను కుప్పంలో అడ్డుకోవాలని చూస్తున్నారని ఆక్షేపించారు.పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలకు సహకరిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+