నమ్మకం పోయింది: బాబుపై జగన్ '420' వ్యాఖ్యలు, వాకౌట్ చేసి నిప్పులు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20వ తేదీన పుట్టారని, అంటే 420 అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అన్నారు.

మధ్యాహ్నం సభ వాయిదా పడిన తర్వాత ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడారు. అంతకుముందు సభలో స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై సాక్షి చేసిన వ్యాఖ్యలు, మంత్రి పత్తిపాటి పుల్లారావు భూములు కొనడం, అగ్రిగోల్డ్ వ్యవహారంపై సభలో గందరగోళం చెలరేగింది.

'జగన్ 'బ్రాండెడ్ షర్ట్'లకు భలే గిరాకీ! నేను మాత్రం డిస్కౌంట్‌లో కొంటాను'

దీంతో, సభలో మహిళా పార్లమెంటేరియన్ జరిగిన సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మాట్లాడిన మాటలను సభలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా వైసిపి సభ నుంచి వాకౌట్ చేసింది. వైసిపి సభ్యులు అసెంబ్లీ గేట్ వద్దకు వచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు డెరెక్షన్..

చంద్రబాబు డెరెక్షన్..

ఈ రోజు చంద్రబాబు డైరెక్షన్, కాల్వ యాక్షన్, స్పీకర్ రియాక్షన్‌గా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అన్నీ కలిసొచ్చాయని, అగ్రిగోల్డ్ అటకెక్కిందన్నారు. ప్రభుత్వం ఇష్యూను పక్కదారి పట్టిస్తోందన్నారు.

స్పీకర్ ప్రెస్ మీట్‌ను అన్ని ఛానల్స్ ప్రసారం చేశాయని, కానీ సాక్షి మాత్రమే చేసినట్లు ప్రభుత్వం హంగామా చేస్తోందన్నారు. దీనికి సభకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఈ రోజు సాక్షిపై మాత్రమే ఎందుకు కక్ష కట్టారో చెప్పాలన్నారు.

నాడు ఓటుకు నోటులో చంద్రబాబు ఆడియో, వీడియో క్లిప్పింగులను ఎందుకు ప్రదర్శించలేదో చెప్పాలన్నారు.

వారి బాధలు తీరుతాయి

వారి బాధలు తీరుతాయి

సభలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పక్కదారి పట్టాయన్నారు. రూ.1180 కోట్లు చెల్లిస్తే 13 లక్షల మందికి న్యాయం జరుగుతుందన్నారు. వారు బాధలు తీరుతాయన్నారు. ఇన్ని లక్షల మందిని చంద్రబాబు పూర్తిగా వదిలేశారన్నారు.

ఎక్కడైనా ఎవరైనా చనిపోతే రూ.5 లక్షలు అంటారని, అగ్రిగోల్డ్ బాధితులు నష్టపోతే రూ.3 లక్షలు ముష్టివేస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు తమకు ఇచ్చిన డాటాను అసెంబ్లీలో చూపించామని జగన్ చెప్పారు. ఏడాదిన్నరలో కేవలం రూ.16 కోట్ల ఆస్తులు మాత్రమే అమ్మారని చెప్పారు.

పత్తిపాటి భార్య పేరుపై..

పత్తిపాటి భార్య పేరుపై..

మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ పేరిట14.8 ఎకరాల భూములు ఎలా కొనుగోలు చేశారో చెప్పాలన్నారు. ఉదయ్ దినకరన్ అనే వ్యక్తి ఇప్పుడు అగ్రిగోల్డ్ గ్రూప్‌కు చెందిన హాయ్ ల్యాండ్‌కు డైరెక్టర్‌గా ఉన్నాడని, ఆయన అగ్రిగోల్డ్ యాజమాన్యానికి బంధువు అన్నారు. వీటన్నింటిపై విచారణ జరిపించాలన్నారు.

తిరుపతిలో హోటల్..

తిరుపతిలో హోటల్..

తిరుపతిలో వెంకటాద్రి హోటల్ కూడా ఉందన్నారు. వీటన్నింటిని విచారణ పరిధిలోకి తీసుకు రావాలని తాము డిమాండ్ చేశామన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో హాయ్ లాండ్ ఆస్తులు ఎందుకు రావడం లేదన్నారు. విశాఖలోని ఆస్తులు ఎందుకు రావడం లేదన్నారు. చాలా విలువైన ఆస్తులు విచారణ పరిధిలోకి రావడం లేదన్నారు. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్నారు.

పత్తిపాటి అంగీకరించారు

పత్తిపాటి అంగీకరించారు

పత్తిపాటిని రక్షించేందుకు స్పీకర్‌ను అడ్డుపెట్టుకుంటున్నారన్నారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్ సీతారామ్‌కు చెందిన తిరుపతి హోటల్‌ను రూ.14 కోట్లకు అమ్మారని చెప్పారు. సీఐడీ విచారణ జరిగిన తర్వాత అగ్రిగోల్డ్ ఆస్తులను కొంతమంది కొనుగోలు చేశారని, అందులో పత్తిపాటి సతీమణి పేరు ఉందన్నారు. దీనిని స్వయంగా పత్తిపాటి అంగీకరించారని చెప్పారు. పత్తిపాటి దినకరన్ నుంచి భూములు కొనుగోలు చేశారని చెప్పారు.

పత్తిపాటిపై తాను చేసిన ఆరోపణలపై హౌస్ కమిటీ వద్దని, జ్యూడిషియల్ విచారణ కావాలని డిమాండ్ చేశారు. నిస్సిగ్గుగా పత్తిపాటి తనను తాను డిఫెన్స్ చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు చెబుతారు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు సైగ చేస్తారు, స్పీకర్ దానిని అమలు చేస్తారని జగన్ అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP walks out from Andhra Pradesh Assembly on Thursday. YSRCp chief YS Jaganmohan Reddy fired at AP CM Nara Chandrababu Naidu.
Please Wait while comments are loading...