జగన్ వీరిని మహిళా అభ్యర్థులతో ఓడిస్తారా..?

ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న సమయంలో అధికార వైసీపీ దూకుడు పెంచింది. నోటిఫికేషన్ విడుదలకు కొద్ది గంటల ముందే 175 నియోజకర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సామాజిక సమీకరణాల లెక్కలు వేసుకునే టికెట్లు కేటాయించినట్టు వైసీపీ జాబితా చూస్తే అర్ధం అవుతుంది. అయితే కీలక నియోజకవర్గాల్లో మహిళా అభ్యర్థులను బరిలోకి దించి ప్రత్యర్థులకు గట్టి షాకే ఇచ్చింది వైసీపీ అధిష్టానం.

ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వంటి నేతలపై మహిళా అభ్యర్థులను వైసీపీ రంగంలోకి దించింది. సుదీర్ఘకాలం తరువాత వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవలే ప్రకటించారు . రాబోవు ఎన్నికల్లో తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అయితే పవన్ కల్యాణ్‌పై మహిళా నేతను వైసీపీ రంగంలోకి దించింది. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం అభ్యర్థిగా జగన్ ప్రకంటించారు.

Ysrcp women leaders contested from key Constituencies

గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన వంగా గీత..ప్రస్తుతం పవన్‌పై ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం మహిళా అభ్యర్థితోనే పోటీ పడనున్నారు. పార్టీ సీనియర్ నాయకురాలు TN దీపికకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. హిందూపురం నుంచి మహిళా అభ్యర్థులెవరూ ఇప్పటి వరకూ పోటీ చేయలేదు. ఏ పార్టీ కూడా ఓ మహిళ నాయకురాలిని తమ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలపలేదు. అందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై కూడా మహిళ అభ్యర్థే బరిలో ఉండటం విశేషం. మంగళగిరి వైసీపీ నుంచి మురుగుడు లావణ్య పేరును పార్టీ అధిష్టానం ఖారారు చేసింది. గతంలో మురుగుడు లావణ్య , తల్లి కాండ్రు కమల మంగళగిరి ఎమ్మెల్యేగా పని చేశారు. దీంతో కీలక మూడు నియోజకవర్గాల్లో మహిళా అభ్యర్థులను బరిలో దించడం జగన్ వ్యూహంలో భాగమనే తెలుస్తోంది. మహిళా అభ్యర్థులతో పవన్, లోకేష్, బాలకృష్ణలను ఓడించడానికి వైసీపీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. మరీ ఈ మహిళా అభ్యర్థులను ఈ ముగ్గురు నేతలు ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+