Polavaram: చంద్రబాబు పోలవరం శ్వేతపత్రంపై వైసీపీ రియాక్షన్ ఇదే..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో అనుసరించిన వైఖరిపై ఇవాళ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వ రివర్స్ టెండరింగ్ తో పాటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఇతర అంశాల్లో తీసుకున్న నిర్ణయాలను చంద్రబాబు తప్పుబట్టారు. పోలవరం పూర్తి కాకపోవడానికి వైసీపీ సర్కార్ తప్పిదాలే కారణమని ఆయన తేల్చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ దీనిపై స్పందించింది.
డయాఫ్రమ్ వాల్ విషయంలో చంద్రబాబు చేసిన విమర్శలపై స్పందించిన మాజీ జలవనరుల మంత్రి అంబటి రాంబాబు.. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ పూర్తి కాకుండా, నదీ ప్రవాహం మళ్లింపు కాకుండా కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. అసలు కేంద్రం పూర్తి చేయాల్సిన జాతీయ ప్రాజెక్టును ఎందుకు తీసుకున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని అప్పట్లో మోడీ చేసిన విమర్శల్ని గుర్తుచేశారు.

పోలవరం శ్వేతపత్రం విడుదల, అనంతరం చంద్రబాబు చేసిన విమర్శలు చూస్తుంటే ప్రాజెక్టును పూర్తి చేసే ఉద్దేశం ఆయనకు ఉన్నట్లు కనిపించడం లేదని అంబటి తెలిపారు. తిరిగి జగన్ అధికారంలోకి వచ్చాక దీన్ని పూర్తి చేస్తారన్నారు. వైసీపీ సర్కార్ హయాంలో పోలవరంలో ఎలాంటి తప్పూ జరగలేదని అంబటి తేల్చేశారు.

చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం నాశనం అయ్యిందనే విషయాన్ని తాము ఆధారాలతో నిరూపిస్తామన్నారు. ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు.












Click it and Unblock the Notifications