• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీఆర్ఎస్ ఎంపీలకు చేతులెత్తి దండం పెట్టినా..: వైవీ ఆవేదన, ‘పొలిటికల్ గేమ్’

|
  No Confidence Motion : రాజ్యసభ, లోక్‌సభ వాయిదా ! ఇక చర్చ జరిగేదేప్పుడు ?

  న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అడ్డంకులు కల్పించవద్దని, చర్చ జరిగేందుకు సహకరించాలని టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలకు చేతులు జోడించి వేడుకున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

  కావేరీ వివాదం 70 ఏళ్లుగా ఉందని, దానిపై తాము పోరాడుతున్నామని అన్నాడీఎంకే ఎంపీలు చెబుతున్నారని చెప్పారు. వారి సమస్యలపై వారు పోరాటం చేయడంలో తప్పు లేదని... వారి సమస్యలను వారు పోరాటం చేస్తుంటే మనం ఆపలేమని అన్నారు.

  మా డిమాండ్లపై వాగ్ధానం ఇస్తేనే..: అవిశ్వాసంపై తేల్చేసిన టీఆర్ఎస్

  ఎంత వేడుకున్నా..

  ఎంత వేడుకున్నా..

  ఇది ఐదు కోట్ల ఆంధ్రుల జీవితాలకు సంబంధించిన సమస్య అని, చర్చ కోసం స్పీకర్ అనుమతించే సమయంలో ఆందోళనలు చేపట్టకుండా ఉండాలని కోరామని చెప్పారు. టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలను ఐదు నిమిషాల పాటు సహకరించాలని వేడుకున్నామని... అయినా వారు తమ ఆవేదనను అర్థం చేసుకోవడం లేదని వైవీ సుబ్బారెడ్డి వాపోయారు. కనీసం రేపై(బుధవారం)నా సభ సజావుగా సాగుతుందని ఆశిద్దామని అన్నారు.

  ఇదో పొలిటికల్ గేమ్

  ఇదో పొలిటికల్ గేమ్

  అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాలని మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడకు కూడా వైసీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. కాగా, అవిశ్వాస తీర్మానం అనేది ఏపీ పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టింది మాత్రమేనని, ఇదో పొలిటికల్ గేమ్ అని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆరోపించడం గమనార్హం. అంతేగాక, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్ణయం మేరకే పార్లమెంటులో తాము ఆందోళనలు చేస్తున్నామని నర్సయ్య గౌడ్‌ అన్నారు. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే వరకూ తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్‌ను ఆడించే శక్తి ఏ పార్టీ(బీజేపీ)కీ లేదని అన్నారు. తమతో చర్చించకుండా అవిశ్వాసం పెడితే తామెందుకు మద్దతు ఇస్తామని ఎంపీ బూర ప్రశ్నించారు.

  చర్చ జరిగేలా చూడండి

  చర్చ జరిగేలా చూడండి

  అంతకుముందు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేలా చూడాలని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు వైయస్సార్‌ కాంగ్రెస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ప్రారంభం కావడానికి ముందు మంగళవారం ఉదయం మహాజన్‌ను ఆమె కార్యాలయంలో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

  వాయిదా వేయడం సరికాదు

  వాయిదా వేయడం సరికాదు

  కేంద్రంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించాలని స్పీకర్‌ను కోరినట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్పీకర్‌ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత 15 రోజులుగా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నా ఆర్థికబిల్లును ఆమోదించారని గుర్తుచేశారు. సభ ఆర్డర్‌లో లేదన్న కారణంతో సభా కార్యకలాపాలను వాయిదా వేయడం సరికాదని తెలిపారు.

  ఆగని ఆందోళనలలతో..

  ఆగని ఆందోళనలలతో..

  కాగా, మంగళవారం కూడా లోక్‌సభలో నిరసనలు చోటుచేసుకోవడంతో.. సభ ఆర్డర్‌లో లేదన్న కారణంగా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ‘అవిశ్వాసం'చర్చను చేపట్టలేకపోయారు. విపక్షాల ఆందోళనల మధ్యే విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌.. ఇరాక్‌లో భారత బందీల మరణానికి సంబంధించిన ప్రకటన చేశారు. అనంతరం స్పీకర్‌ సభను బుధవారానికి వాయిదావేశారు. రెండో విడత బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం నుంచి దిగువ సభ మాదిరే పెద్దలసభలోనూ ఆందోళనలు సాగాయి. మంగళవారం కూడా అలాంటి పరిస్థితే తలెత్తింది. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం తీరును కాంగ్రెస్‌ తప్పుపట్టింది. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్‌ వెంకయ్యనాయుడు రాజ్యసభను బుధవారానికి వాయిదా వేశారు.

  English summary
  YSRCP MP YV Subba Reddy urged TRS and AIADMK MPS to support no confidence motion in parliament.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X