వైసీపీ ఇన్ ఛార్జ్ లకు వైవీ సుబ్బారెడ్డి షాక్ ! టికెట్లు కన్ఫమ్ అయ్యే దాకా..
ఏపీలో ఓవైపు విపక్షాలు టీడీపీ జనసేన అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేసిన వేళ వైసీపీ సీనియర్ నేత తమ పార్టీలో ఇన్ చార్జ్ లకు షాకిచ్చారు. పలు చోట్ల ఇన్ ఛార్జ్ ల ప్రకటన తర్వాత కూడా అసంతృప్తులు వ్యక్తమవుతున్న వేళ ఓ కీలక అంశంపై క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటి వరకూ వైసీపీ ఇన్ చార్జ్ ల మార్పుల్లో చోటు దక్కించుకున్న వారికి టికెట్లు ఖరారవుతాయా లేదా అన్న ఆందోళన వ్యక్తమవుతున్న వేళ సుబ్బారెడ్డి కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.
రాష్ట్రంలో వైసీపీ ఇప్పటికే ఇన్ చార్జ్ లుగా ఎంపిక చేసిన వారికి షాకిచ్చేలా.. తుది జాబితాలో చోటు దక్కించుకున్న వాళ్లే అభ్యర్ధులు అంటూ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా సరే ప్రస్తుతానికి ఇన్ ఛార్జ్ లు మాత్రమేనంటూ క్లారిటీ ఇచ్చేశారు. తద్వారా ఇన్ ఛార్జ్ లుగా ఎంపిక చేసిన వారు అభ్యర్ధులు కాదని, వీరి స్ధానంలో తమకు చోటు దక్కలేదని ఇతర నేతలు భావించాల్సిన అవసరం లేదని సుబ్బారెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఇవాళ విడుదల చేసిన టీడీపీ జనసేన తొలి జాబితాపైనా సుబ్బారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ అభ్యర్ధులు బలంగా ఉండటం వల్లే చంద్రబాబుకు తమ అభ్యర్ధులపై సుదీర్ఘ కసరత్తు చేయాల్సి వస్తోందని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికీ టీడీపీకి 40 స్ధానాల్లో అభ్యర్ధులు లేరని గుర్తుచేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కాకుండా చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే పవన్ కళ్యాణ్ 24 సీట్లకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications