Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోకేష్ కు భద్రత కుదింపు ... బ్రాహ్మణికి, భువనేశ్వరికి నో సెక్యూరిటీ

Recommended Video

    చంద్రబాబు భద్రతా వ్యవస్థను తగ్గిస్తున్న జగన్ : AP Govt Reduced The Security Of CBN And His Family

    ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి ఉన్న భద్రతా వ్యవస్థను ఏపి సిఎం వైయస్ జగన్ ఒక్కొక్కటిగా తగ్గించుకుంటు వస్తున్నారు . ప్రజా వేదిక కూల్చివేత ప్రకటించిన ఒక రోజు తరువాత, జగన్ నేతృత్వంలోని వైయస్ఆర్సిపి ప్రభుత్వం మరోసారి చంద్రబాబు కుటుంబానికి భద్రత తగ్గించింది. సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, చంద్రబాబు యొక్క కాన్వాయ్ తగ్గింది .ఇక ఇప్పుడు టిడిపి చీఫ్ చంద్రబాబు కుటుంబ సభ్యుల భద్రతను తగ్గించారు వైసీపీ సర్కార్ .

    మొన్నటి వరకు చంద్రబాబుతో పాటు, నారా లోకేష్ కూడా జెడ్ కేటగిరీ జాబితాలో ఉన్నారు. ఆయనకు 5 + 5 సెక్యూరిటీ ఉండేది. ఇక లోకేష్ కు జెడ్ క్యాటగిరీని తొలగిస్తూ 2 + 2 గన్ మ్యాన్స్‌కు ఆయన సెక్యూరిటీని కుదించారు. మిగిలిన కుటుంబ సభ్యులైన భువనేశ్వరికి , బ్రాహ్మణికి భద్రత పూర్తిగా తొలగించారు . ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చంద్రబాబు ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవలే గతంలో ఆయనకు ఉన్న భద్రతను తగ్గించారు. తాజాగా ఆయన కుటుంబసభ్యుల భద్రతను సైతం తగ్గించేశారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా భద్రత తగ్గించడం పట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి . కేవలం వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని , గతంలో జగన్ ప్రతిక్షంలో ఉన్నప్పుడు ఆయనకు తగిన భద్రత కల్పించామని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.

    Z Plus category removed to Lokesh .. No security for Brahmani, Bhuvaneswari

    ఇదిలా ఉంటే ఇటీవల కుటుంబసభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు మంగళవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఎంపీల పార్టీ మార్పు, ప్రజా వేదిక కూల్చివేత తదితర విషయాలపై షాక్ లో ఉన్న అధినేత ఇదే సమయంలో కుటుంబ సభ్యుల భద్రత తొలగింపు, మాజీ మంత్రి లోకేష్ కు జెడ్ క్యాటగిరీ తొలగింపుపై కూడా సహనంతో ఉన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వొచ్చని భావిస్తున్నారు. , ప్రజా వేదిక కూల్చివేత, పార్టీ ఫిరాయింపు లపై స్పందించే అవకాశం ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+