Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై జీరో ఎఫ్ఐఆర్.. షాకిస్తున్న కేసులు, నేడు కోర్టులో మధ్యంతరబెయిల్‌పై విచారణ!!

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పైన తాజాగా మళ్లీ కేసు నమోదు కావడంతో పిన్నెల్లి బ్రదర్స్ ఇరకాటంలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాచర్ల లోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన తోపాటు సిఐ పై దాడి చేశారన్న కారణంతో వారిపైన రెండు కేసులు నమోదయ్యాయి.

ఆపై తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావు పై దాడి చేసిన ఘటన, మహిళను దుర్భాషలాడిన ఘటన పైన కూడా పోలీసులు వీరిద్దరిపైన కేసు నమోదు చేశారు. ఇక తాజాగా పిన్నెల్లి సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఒక టీడీపీ కార్యకర్త పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు వారిపైన జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.

Zero FIR against Macharla MLA Pinnelli Shocking cases hearing on interim bail in court today

ప్రాణ హాని ఉందని టీడీపీ కార్యకర్త ఫిర్యాదు
పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నుండి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన నోముల మాణిక్యరావు తన న్యాయవాది లక్ష్మీనారాయణతో కలిసి ఆదివారం సాయంత్రం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మొదట పిటీషన్ తిరస్కరించిన మంగళగిరి రూరల్ పోలీసులు
పోలింగ్ కేంద్రంలో టిడిపి ఏజెంట్ గా పని చేసిన నోముల మాణిక్యరావు తనను చంపడానికి పిన్నెల్లి బ్రదర్స్ నలుగురిని పెట్టారని, తాను మాచర్లకు వెళ్లే పరిస్థితి లేదని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. అయితే ఫిర్యాదు అక్కడ తీసుకోవడం కుదరదు అంటూ మంగళగిరి రూరల్ పోలీసులు తిరస్కరించారు.

డీజీపీ చొరవతో నమోదైన జీరో ఎఫ్ఐఆర్
దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి డిజిపిని ఆదివారం రాత్రి కలిశారు. చివరకు డిజిపి ఆదేశాలతో మంగళగిరి పోలీసులు కేసును నమోదు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన నుండి నిన్న రాత్రి ఫిర్యాదును స్వీకరించారు. నోముల మాణిక్యరావు ఎన్నికల పోలింగ్ నాడు కండ్లకుంట గ్రామంలో దారుణ ఘటనలను ఆయన పోలీసులకు వివరించారు.

బెయిల్ కోసం కోర్టుకెళ్ళిన పిన్నెల్లి.. నేడు విచారణ
ఇక ఈ కేసులలో ఇప్పటికే పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా, పిన్నెల్లి విధించిన షరతులను ఉల్లంఘించారని ఆయనకు బెయిల్ ఇవ్వద్దని ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియజేశారు. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని కోర్టును కోరారు. ఆయనకు బెయిల్ ఇస్తే కౌంటింగ్ రోజున కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందన్నారు. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు .అయితే నేడు మరో మారు పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+