కూటమిలో జెడ్పీ ఛైర్మన్ స్థానాలు కొలిక్కి: బీజేపీకి కడప, జనసేనకు దక్కే జిల్లాలు ఇవే..!!
జిడ్పీ స్థానాల పైన కూటమిలో స్పష్టత వచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు వెల్లడవుతున్న వేళ జెడ్పీ పీఠాల పైన కూటమి నేతలు ఒక అంగీకారానికి వచ్చాయి. మూడు పార్టీల మధ్య జిల్లాల సర్దుబాటు పూర్తయింది. అందులో భాగంగా జనసేనకు అయిదు, బీజేపీకి ఒక జిల్లా పరిషత్ ఛైర్మన్ స్థానం దక్కనుంది. ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా సీమక్ష చేసిన కడప జెడ్పీ సీటు బీజేపీకి ఇవ్వగా.. జనసేనకు కేటాయింపులు పూర్తయ్యాయి. చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఈ స్థానాలు అధికారికంగా ఖరారు కానున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించిన కూటమి పార్టీలు జెడ్పీటీసీ.. ఎంపీటీసీ స్థానాల్లోనూ అదే రకమైన ఫలితాలను అంచనా వేస్తున్నాయి. మొత్తం 28 జిల్లా పరిషత్ ఛైర్మన్ సీట్లను సొంతం చేసుకుంటామని ధీమాగా ఉన్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు కూటమి పార్టీల ఖాతాల్లో ఏకగ్రీవం అయ్యాయి. కాగా.. మొత్తం 28 జిల్లా పరిషత్ ఛైర్మన్ స్థానాల పంపకాల పై కూటమి పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. అందులో భాగంగా జనసేనకు అయిదు, బీజేపీకి ఒక స్థానం దక్కనుంది. జనసేనకు పల్నాడు, శ్రీసత్యసాయి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు దక్కనున్నాయి. అదే విధంగా తిరుపతి జిల్లా వైస్ ఛైర్మన్ పోస్టు జనసేనకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కాగా.. బీజేపీకి కడప జిల్లా జెడ్పీ పీఠం దక్కనుంది.

ఫలితాల తరువాత అధికారిక ప్రకటన
బీజేపీకి తొలుత జెడ్పీ పీఠం విషయంలో అనేక చర్చలు జరిగాయి. కడప జిల్లా విషయంలో బీజేపీ నేతలు పట్టు బట్టారు. అక్కడ వ్యూహాత్మకంగా బీజేపీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అది నారాయణ రెడ్డి సోదరుడు కుమారుడికి కడప జెడ్పీ పీఠం దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లా నుంచి పలువురు టీడీపీ నేతలు రేసులో ఉన్నారు. అయితే, భవిష్యత్ వ్యూహాల్లో భాగంగా ఈ సీటు ను బీజేపీ కోటాలో ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ చదిపిరాళ్ల రాజేష్ రెడ్డికి ఈ పదవి కేటాయిస్తారని సమాచారం. ఈ రోజు ఫలితాల తరువాత అధికారంగా కూటమి పార్టీల మధ్య జిల్లా పరిషత్ ఛైర్మన్ స్థానాల పైన ప్రకటన చేయనున్నారు. పార్టీల మధ్య లాస్ట్ మినిట్ లో ఏమైనా మార్పులు జరిగితే మినహా.. ఇవే స్థానాలు ప్రకటించటం లాంఛనంగా కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications
