• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పీఎం కేర్స్ ఫండ్‌కు మద్దతుగా ఏషియన్ పెయింట్స్: కరోనా వారియర్స్‌‌కు "వన్ నేషన్ వన్ వాయిస్‌" అంకితం

కరోనావైరస్ మహమ్మారి పై ముందువరుసలో ఉండి పోరాడుతున్న కరోనావారియర్లకు దేశం యావత్తు పలు రూపాల్లో సంఘీభావం తెలుపింది. వారు చేస్తున్న సేవలను కొనియాడుతూ వారికి మద్దతుగా నిలుస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే కరోనావారియర్లకు మద్దతుగా నిలుస్తూ వారికోసం అంకితం చేయబడ్డ ఒక జాతీయ గేయంను ప్రముఖ పెయింట్స్ సంస్థ ఏషియన్ పెయింట్స్ స్పాన్సర్ చేసింది. వన్ నేషన్ వన్ వాయిస్ పేరుతో మే 17 ఆదివారం రోజున ఈ కార్యక్రమం జరిగింది. "జయతు జయతు భారతం, వసుదేవ కుటుంబకం" అనే ఈ పాటను ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ రికార్డు స్థాయిలో 200 మంది గాయకులు 14 భాషల్లో ఆలపించారు. ఒక పాటకు ఈ కార్యక్రమం అతిపెద్ద వేదికగా నిలిచింది.

కోవిడ్-19 సంక్షోభంలో కరోనావారియర్స్‌కు తామంతా అండగా ఉన్నామని చెబుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం.. ప్రముఖ సింగర్ సోనూనిగమ్, శ్రీనివాస్ మరియు ISRA సీఈఓ సంజయ్ టాండన్‌ల ఆలోచన నుంచి పుట్టింది. ఈ కార్యక్రమంకు ఒక ప్రత్యేకత ఉంది. ఇంట్లోనే ఉంటూ గాయకులు ఈ పాటను రికార్డింగ్ చేశారు. అయితే ఈ రికార్డింగ్‌ను పూర్తి చేయడం ఒక సవాలుగా మారింది. ఎందుకంటే లాక్‌డౌన్ సమయంలో అంతా ఇళ్లకే పరిమితమై తమకు సరైన రికార్డింగ్ ఎక్విప్‌మెంట్ లేకపోయినప్పటికీ తమకు తోచినపద్దతిలో రికార్డింగ్ చేశారు.

Asian paints sponsors one nation one voice anthem to support nations fight against Coronavirus

ఒక మంచి పనికి ఈ అడ్డంకులన్నీ చిన్నవిగా కనిపించాయి. ఎట్టకేలకు మునుపెన్నడూ లేని విధంగా అంతమంది గాయకులు ఈ పాటను పాడటం అభినందనీయం. ఇక 14 భాషల్లో ఈ పాటను పాడటం జరిగింది. ఈ పాట పాడిన వారిలో లెంజడరీ సింగర్స్ ఆశాభోంస్లే, అనూప్ జలోటా, అల్కా యాగ్నిక్ , హరిహరన్, కైలాష్ ఖేర్, కవితా కృష్ణమూర్తి, కుమార్ సాను, మహాలక్ష్మీ అయ్యర్, మనో, పంకజ్ ఉదాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, షాన్, సోనూ నిగమ్, సుధేష్ భోంస్లే, సురేష్ వాద్కర్, శైలేంద్ర సింగ్, శ్రీనివాస్, తాలత్ అజీజ్, ఉదిత్ నారాయణ్, శంకర్ మహదేశన్, జస్బీర్ జస్సీలతో పాటు మరో 80 మంది గాయకులు ఈ పాటకు తమ గొంతును అందించారు.

Asian paints sponsors one nation one voice anthem to support nations fight against Coronavirus

ఏషియన్ పెయింట్స్ సంస్థ ఏ వితప్కర సమయం వచ్చినా బాధ్యతతో వ్యవహరించిందని ఏషియన్ పెయింట్స్ ఎండీ మరియు సీఈఓ అమిత్ సింగ్లే చెప్పారు. భవిష్యత్తులో దేశం ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని చెప్పిన అమిత్... ఈ విపత్కర సమయంలో ధైర్యం చెప్పేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదని అన్నారు. ప్రతి ఇంటికి ఏషియన్ పెయింట్స్‌తో అనుబంధం ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని రూపొందిచడం చాలా గర్వంగా ఉందని చెప్పారు. దాదాపు 200 మంది గాయకులను వారి ఇళ్ల నుంచే పాటను రికార్డింగ్ చేయడం మామూలు విషయం కాదని అన్నారు.

Asian paints sponsors one nation one voice anthem to support nations fight against Coronavirus

మన దేశంలో ఉన్న ప్రతి పురుషుడికి ప్రతి మహిళకు పీఎం కేర్స్ ఫండ్‌ ద్వారా తాము ఈ సమయంలో అండగా ఉండటం సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోందని అమిత్ చెప్పారు.వన్ నేషన్ వన్ వాయిస్ పేరుతో ఆలపించిన ఈ పాట కేవలం ఒక పాట కాదని ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ సంక్షోభంను జయించి ఒక దేశంగా మరింత బలోపతం అవుతామనే నమ్మకం తమకుందని అన్నారు అమిత్.

ఇదిలా ఉంటే కోవిడ్-19 పోరుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్‌కు రూ.35 కోట్లు విరాళం ఇచ్చింది ఏషియన్ పెయింట్స్. ఇక 17 మే ఆదివారం రోజున ఈ పాటను 100 వేదికలపై విడుదల చేసినట్లు తెలిపింది. ఇందులో టీవీ, రేడియో, సోషల్ మీడియా, ఇతర అప్లికేషన్స్, ఓటీటీ, వీఓడీ, ఐఎస్‌పీ, డీటీహెచ్ మరియు సీఆర్‌బీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఈ సాంగ్‌ను రిలీజ్ చేసినట్లు చెప్పారు.

Asian paints sponsors one nation one voice anthem to support nations fight against Coronavirus

ఈ పాటను విడుదల చేసేందుకు దాదాపు 100 బ్రాడ్‌క్యాస్ట్, సోషల్, ఆంప్లిఫికేషన్ మరియు ఇతర టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్ సహకారం అందించాయని పేర్కొంది. వీరంతా కూడా పీఎం కేర్స్ ఫండ్‌కు మద్దతుగా నిలిచేందుకు వచ్చారని వెల్లడించింది. ఇక ఈ పాట 14 భాషల్లో

ఈ పాటను పాడటం జరిగింది. హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడం, మళయాలం, భోజ్‌పురీ, అస్సామీ, కశ్మీరీ, సింధీ, రాజస్థానీ, మరియు ఒడియా భాషల్లో ఈ పాటను పాడారు.

1942లో ఏర్పాటైన ఏషియన్ పెయింట్స్ దేశంలో అగ్రస్థానంలో ఉండగా ఆసియా ఖండంలో నాల్గవ అతిపెద్ద పెయింట్స్ కంపెనీగా కొనసాగుతోంది. ఈ కంపెనీ టర్నోవర్ రూ.192.48 బిలియన్లు. ఏషియన్ పెయింట్స్ 15 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా 26 పెయింట్ మానుఫాక్చురింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 60దేశాల్లో వినియోగదారులకు సేవలందిస్తోంది. పెయింట్ ఇండస్ట్రీలో ఏషియన్ పెయింట్స్ ఎప్పుడూ ముందువరసలోనే కొనసాగింది. దేశంలో సరికొత్త కాన్సెప్ట్స్‌తో ముందుకొచ్చింది. అలాంటి వాటిలో కలర్ ఐడియాస్, హోమ్ సొల్యూషన్స్, కలర్ నెక్ట్స్, కిడ్స్ వరల్డ్ లాంటి కాన్సెప్ట్స్ తీసుకొచ్చి ఆకట్టుకుంది.

Asian paints sponsors one nation one voice anthem to support nations fight against Coronavirus

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more