శృంగార సన్నివేశాలకు ముందు ఆ డైరెక్టర్ నన్ను ఆ విషయం అడిగాడు..!
ఈ మధ్యకాలంలో మీటూ ఉద్యమం గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది.పలువురు సెలబ్రిటీ మహిళలు సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి బహిరంగంగా చెప్పుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కొందరు బడాబాబులకు ఊడిగం చేయాల్సిందేనంటూ వారి ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా సేక్రెడ్ గేమ్స్ -2 సిరీస్ హీరోయిన్ అమృత సుభాష్ కూడా బహిరంగంగానే ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. లస్ట్ స్టోరీస్-2 చిత్రంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన అమృత సుభాష్ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌ను తన స్టేట్‌మెంట్‌లో ప్రస్తావించింది. దీంతో మరోసారి అనురాగ్ కశ్యప్ వార్తల్లో నిలిచారు.

సేక్రెడ్ గేమ్స్ 2 సిరీస్ కోసం షూట్ జరుగుతున్న సమయంలో తొలిసారిగా అమృత ఒక శృంగార భరితమైన సన్నివేశంలో నటించాల్సి ఉంది. అంతకుముందు ఎప్పుడూ సెక్స్ సీన్ చేయలేదట. సెక్స్ సీన్ షూట్ మరికాసేపట్లో ప్రారంభం అవుతుందనగా అనురాగ్ కశ్యప్ అమృతను తన పీరియడ్స్ డేట్ ఎప్పుడు అని అడిగాడట. దీంతో ఆమె తన డేట్ చెప్పడంతో అనురాగ్ కశ్యప్ అనూహ్యమైన నిర్ణయం సెట్స్ పై తీసుకున్నాడట.
అమృత సుభాష్ తన పీరియడ్స్ డేట్స్ గురించి చెప్పగానే అనురాగ్ కశ్యప్ వెంటనే షూట్‌కు ప్యాకప్ చెప్పేశాడట.తన పీరియడ్స్ డేట్స్‌లో సెక్స్ సీన్స్ చేయకూడదని నిర్ణయించుకుని షూటింగ్‌ను వాయిదా వేసినట్లు అమృత చెప్పుకొచ్చింది. ఈ విషయంలో అనురాగ్ చాలా సెన్సిటివ్ అని అమృత వెల్లడించింది. అనురాగ్ కశ్యప్ తనపట్ల చాలా బాధ్యతగా వ్యవహరించినట్లు అమృత సుభాష్ గుర్తు చేసుకుంది.

అమృత సుభాష్ అంతకుముందు లస్ట్ స్టోరీస్ -2లోని ది మిర్రర్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చింది.దీన్ని కొంకనా సేన్ శర్మ డైరెక్ట్ చేశారు.తిలోత్తమషోమ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది అమృత.అందులో ఓ పనిమనిషి క్యారెక్టర్ పోషించిన అమృత తను పనిచేసే ఇంటినే తన భర్తతో ఏకాంతంగా గడిపేందుకు వినియోగించుకుంటుంది. అయితే ఆ ఇంటి ఓనర్ పాత్రలో తిలోత్తమ నటించారు. భార్య భర్తల మధ్య శృంగార భరితమైన సన్నివేశం చూసి షాక్‌కు గురవుతాడు తిలోత్తమ. ఈ కథ శృంగారం చుట్టే తిరుగుతుంది.












Click it and Unblock the Notifications