అర్దరాత్రి మంచం మీద ప్రాణాలు వదిలేసిన లేడీ పోలీసు, రెండేళ్ల క్రితం భర్త కూడా!

బెంగళూరు: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్ ఇన్‌ఫెక్షన్ బాధితురాలిగా ఉన్నప్పటికీ ఓ ట్రాఫిక్ పోలీసు డ్యూటీ చేసింది. కోవిడ్ తో పోరాటం చేసిన లేడీ పోలీసులు అప్పట్లో ప్రాణాలతో భయపడింది. డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లిన మహిళా ట్రాఫిక్ పోలీసు మహిళ గుండెపోటుతో మరణించింది. అయితే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన 20 నెలల చిన్నారి అనాథ అయ్యింది. .
బెంగళూరు సిటీలోని కెంగేరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న లేడీ పోలీసు తక్కువ వయసులోనే గుండెపోటు వచ్చి మరణించింది.

గత కొన్నేళ్లుగా కెంగేరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ప్రియాంక అనే మహిళ విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజులాగే ఆదివారం ప్రియాంక ఉద్యోగం చెయ్యడానికి వెళ్లారు. పని ముగించుకుని ఇంటికి వెళ్లిన ప్రియాంకకు ఆదివారం రాత్రి 11. 30 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చింది. అయితే ఆస్పత్రికి వెళ్లలేక, ఆసుపత్రికి వెళ్లడానికి తోడు ఎవ్వరూ లేకపోవడంతో మంచంపై ప్రియాంక మృతి చెందిదని అధికారులు అంటున్నారు.

A female traffic policeman who was on her way home from duty died of a heart attack at home late at night

కొన్నేళ్ల క్రితం కర్ణాటక పోలీసు శాఖలో చేరిన ప్రియాంక 2018లో పెళ్లి చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు ప్రపంచాన్ని పీడించిన కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రియాంక భర్త 2021 చివరిలో మరణించాడు. భర్త చనిపోయేటప్పటికే ప్రియాంక గర్బవతి అయ్యింది. ప్రియాంక గర్భవతి కావడం, అప్పుడే కోవిడ్ కారణంగా ఆమె భర్తను కోల్పోయింది. అయితే కుమిలిపోకుండా బిడ్డకోసం బతకాలి అనుకున్న ప్రియాంక పోలీసు డ్యూటీ చేస్తూ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

తండ్రి లేకుండా పుట్టిన చిన్నారి ఆమె తల్లి ప్రియాంక సంరక్షణలో పెరిగింది. అయితే అతి చిన్న వయసులోనే తల్లి ప్రియాంకను పొగొట్టుకున్న చిన్నారి ఇప్పుడు అనాథ అయ్యింది. రెండు రోజుల క్రితం గుండెపోటు నివారణపై బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి సేవ్ లైఫ్ పౌండేషన్, టీటీఆర్ఎస్ఐ సహకారంతో జూన్ 12 నుండి జూన్ 17 వరకు శిక్షణ పొందారు.

అయితే ఇది జరిగిన రెండు రోజుల్లోనే బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ విభాగంలోని కానిస్టేబుల్ గా పని చేస్తున్న ప్రియాంక గుండెపోటుతో మృతి చెందడంతో సాటి పోలీసులు హడలిపోయారు. ఇటీవల బెంగళూరులోని శివాజీనగర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా ఉద్యోగం చేస్తున్న సత్య కూడా విశ్రాంతి లేకుండా 24 గంటల పాటు ట్రిబుల్ డ్యూటీ చేసి ఇంటికి వెలుతున్న సమయంలో మార్గం మధ్యలోనే గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+