మైండ్ బ్లాక్, క్యూకడుతున్న రెబల్స్, ప్రయోగాలు కాదు, ప్రాక్టికల్ గా ఉండాలి, శివన్న ఫైర్!
బెంగళూరు/తుమకూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు మరోసారి ఎమ్మెల్యే టిక్కెట్లు సంపాధించుకోవాలని అనేక ప్రయత్నాలు చేసి చితకలబడ్డారు. అయితే మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేస్తున్న ప్రయత్నాలకు బీజేపీ హైకమాండ్ బ్రేక్ లు వేసింది, కొత్త వారికి అవకాశం ఇస్తున్నామని బీజేపీ ప్రకటించింది.
అయితే కొత్తకొత్త ప్రయోగాలు ఎత్తవరకు కరెక్టు ? అనే విషయం పక్కనపెడితో పాతనీళ్లు తిరగబడుతున్నాయని బీజేపీ హైకమాండ్ కు అర్థం అవుతోంది, ఇప్పటికే మాజీ సీఎం, మాజీ ఉప ముఖ్యమంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరు, మాజీ మంత్రులు బీజేపీ మీద తిరుగుబాటు చేస్తామని ప్రకటించారు, కొందరు ఇప్పటికే బీజేపీకి రాజీనామాలు చేశారు.

ఇదే బాటలో 1994లో మొదటి సారి బీజేపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి రెండు సార్లు మంత్రిగా పని చేసిన తుమకూరు పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సోగూడు శివన్న బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నేను మీకు పనికిరాను అనుకున్పప్పుడు మీరు నాకు ఎలా ఉపయోగపడుతారు ? అని మాజీ మంత్రి శివన్న బీజేపీ నాయకులను ప్రశ్నించారు.
తుమకూరు పట్టణ నియోజక వర్గం బీజేపీ టిక్కెట్ జీబీ, జ్యోతి గణేష్ కు ఇవ్వడంతో మాజీ మంత్రి సూగోడు శివన్న మండిపడుతున్నారు. నాకు టిక్కెట్ ఇస్తామని ఇన్ని రోజులు బీజేపీ పెద్దలు హామీ ఇస్తూ వచ్చారు. చివరి నిమిషంలో జీబీ. గణేష్ కు టిక్కెట్ కేటాయించారు. దశాభ్దాల పాటు బీజేపీకి సేవ చేసుకుంటూ వచ్చిన తనకు సరైన బుద్ది చెప్పారని మాజీ మంత్రి సూగోడు శివన్న బీజేపీ హైకమాండ్ మీద అసహనం వ్యక్తం చేశారు.
మీరే చేసే పనిమీరు చేశారు, నేను ఏం చెయ్యాలో అదే చేస్తానని మాజీ మంత్రి శివన్న బీజేపీ నాయకులు తేల్చి చెప్పారు. తుమకూరులో మద్దతుదారులతో సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి శివన్న వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చెయ్యాలని నిర్ణయించారు. మాజీ మంత్రి శివన్న బాటలో కర్ణాటకలోని చాలా నియోజక వర్గాల్లో బీజేపీ సీనియర్ నాయకులు హైకమాండ్ మీద తిరుగుబాటు చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications