police officer: వరుసగా 24 గంటల డ్యూటీ, ఇంటికి వెలుతుంటే ?, ఏం జరిగిందంటే?, మ్యాటర్!

బెంగళూరు/శివాజీనగర్: పోలీసులకు ఎంత పని ఒత్తిడి ఉంటుందో పెద్దగా చెప్పనవసరం లేదు. సెలవులు లేకుండా, సాటి ఉద్యోగులు సెలవుల మీద వెళ్లిన తరువాత వాళ్ల విధులు కూడా పోలీసులు చేస్తుంటారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు, రిజర్వ్ పోలీసులు అయినా సరే, సెలవులు లేకపోతే వాళ్ల పరిస్థితులు మరి దారుణంగా తయారౌతాయని మరోసారి ఐటీ హబ్ లో వెలుగు చూసింది.

బెంగళూరు సిటీలోని శివాజీనగర్‌లోని ట్రాఫిక్‌ విభాగంలో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్‌ఐ)గా విధులు నిర్వహిస్తున్న సత్యా ట్రాఫిక్‌ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. బెంగళూరులో ట్రాఫిక్ ఏఎస్ఐ సత్యా గుండెపోటుతో మృతి చెందడంతో సాటి ట్రాఫిక్ పోలీసులు హడలిపోయారు.

A police officer who was on duty for 24 hours died of a heart attack, what actually happened in Bengaluru

ఏఎస్ఐ సత్యా వరుసగా 24 గంటలు ట్రిపుల్ డ్యూటీ పనిచేసి ఇంటికి తిరిగి వస్తుండగా గుండెపోటు వచ్చిందని అధికారులు అంటున్నారు. వరుసగా ఒకే రోజు 24 గంటలపాటు నిరంతరాయంగా పని చేయడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఏఎస్ఐ సత్యా చనిపోయారని అధికారులు అంటున్నారు. ఏఎస్ఐ సత్యా ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు విధుల్లో ఉన్నారని వెలుగు చూసింది.

ఏఎస్‌ఐ సత్యా వరుసగా 24 గంటలు ట్రిపుల్‌ డ్యూటీ చేశాడా లేదా అన్న విషయంపై స్పష్టత లేదని అధికారులు చెప్పడంతో ఆయన కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అయితే పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఏఎస్ఐ సత్యా కుప్పకూలి మృతి చెందినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. శివాజీనగర్ ట్రాఫిక్ ఏఎస్సైగా పనిచేస్తున్న సత్యా విధుల్లో ఉండగా గుండెపోటుతో మృతి చెందడంతో పోలీసు సిబ్బంది సంతాపం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+