కోర్టులో సీనియర్ టైపిస్టు, ఏం కష్టం వచ్చిందో ? ఏమో ?, డెత్ నోట్ రాసి ఏం చేశాండంటే?
కోర్టులో పని చేస్తున్న వ్యక్తి ఆయన పని ఆయన చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు చాలా సంతోషంగానే ఉన్నాడు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
బెంగళూరు/శివమొగ్గ: కోర్టులో పని చేస్తున్న వ్యక్తి ఆయన పని ఆయన చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు చాలా సంతోషంగానే ఉన్నాడు. అయితే ఆయన జీవితంలో ఊహించని కష్టాలు ఎదురైనాయి. ఇన్ని సంవత్సరాలు ఇతరుల వియాలు పిన్ టైప్ చేసే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సాగర్ కోర్టు ఎదుట టైపిస్టుగా ఉద్యోగం చేస్తున్న నిత్యానంద అనే వ్యక్తి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేలాడి గ్రామంలో చోటుచేసుకుంది.
సాగర్ కోర్టులో ఉద్యోగం చేస్తున్న టైపిస్ట్ నిత్యానంద (56) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. రాత్రి నిత్యానంద నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సాగర్ తాలూకాలోని కేలాడి గ్రామంలోని నదిలో దూకి నిత్యానంద ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిత్యానంద మృతదేహం నది సమీపంలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిత్యానంద మృతదేహంతో పాటు అతను రాసిన డెత్ నోట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, నిత్యానంద ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు అంటున్నారు.
శివమొగ్గ జిల్లాలోని సాగర పట్టణంలోని కోర్టు ఎదుట గత 35 ఏళ్లుగా నిత్యానంద టైపిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అయితే నిత్యానందకు ఓ చెవి పూర్తిగా పని చెయ్యడం లేదని, రెండో చెవికి చెవిటి మిషన్ పెట్టకున్నాడని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. నాకు వినిపించడం లేదు. ఒక చెవి పూర్తిగా వినిపించడం లేదు, మరో చెవి కొంత మేర వినిపిస్తోంది. రానున్న రోజుల్లో మరో చెవి కూడా పని చెయ్యకుండా పోతుందని నిత్యానంద అతని స్నేహితుల దగ్గర విచారం వ్యక్తం చేసేవాడని తెలిసింది.
నేను నా పని చేయ్యలేను. నేనెప్పుడూ ఈ సమాజంలో పనికిమాలిన వ్యక్తిగా జీవించాలనుకోను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావుకు మరెవరూ బాధ్యులు కారు. నేను నా స్వంత సంతకంతో ఈ డెత్‌నోట్‌పై సంతకం చేశాను అని డెత్ నోట్ లో రాశాడని సాగర పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications