ఎలక్షన్ టైమ్ లో ఏం జరిగింది ?, చెక్ పోస్టులో పోలీసును తొక్కించి చంపింది ఎవరు, లారీనా, లేక ఏదైనా?
గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందాడు. విధులు నిర్వహించడానికి వెళ్లిన పోలీసు ప్రాణం చెక్ పోస్ట్ సమీపంలోనే పోయింది.
బెంగళూరు/కలబురిగి: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందాడు. విధులు నిర్వహించడానికి వెళ్లిన పోలీసు ప్రాణం చెక్ పోస్ట్ సమీపంలోనే పోయింది. ఆ సమయంలో చెక్ పోస్ట్ దగ్గర మరెవ్వరు లేరని వెలుగు చూసింది. ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఉదయం వరకు రోడ్డు ప్రమాదంలో పొలీసు చనిపోయిన ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు.
దీంతో రోడ్డుపై సంచరించిన వాహనదారులు సైతం ఆ పోలీసు గురించి పట్టించుకోలేదు. పోలీస్ కానిస్టేబుల్ కూడా సివిల్ డ్రెస్‌లో ఉండడంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు కూడా ఎవ్వరూ అతని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు, మద్యం తాగి కిందపడి ఉంటాడని అందరూ పొరపాటుపడి ప్రమాదానికి గురైన పోలీసును పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో తీవ్రగాయాలైన అతను చనిపోయాడు.
కర్ణాటకలోని కలబురగి జిల్లా చిత్తాపూర్ తాలూకాలోని లడ్లాపూర్-డిగ్గీ తండా వద్ద రాత్రి షిఫ్టు సమయంలో చెక్ పోస్ట్ లో తనిఖీకి వెళ్లిన పోలీసు కానిస్టేబుల్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కలబురగి జిల్లా చిత్తపురా తాలూకా వాడి పోలీస్ స్టేషన్‌కు చెందిన కరియప్ప (37) అనే వ్యక్తి కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

లాడ్లాపూర్-డిగ్గీ తండా రహదారిపై ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన కానిస్టేబుల్ కరియప్ప ఇంట్లో భోజనం చేసి తరువాత చెక్ పోస్టు దగ్గర విధులు నిర్వహించడానికి బైక్ లో నలవార్ చెక్ పోస్ట్ వైపు వెళ్లాడు. ఉదయం స్థానికులు వెళ్లి చూసే సరికి రోడ్డు పక్కనే కరియప్ప రక్తపు మడుగులో పడి శవమై కనిపించాడు.
పోలీస్ కానిస్టేబు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కలబురగి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఇషా పంత్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై వాడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రమాదానికి గురైన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్మగ్లింగ్, దొంగ సరుకు రవాణా చేసేవాళ్లు ఎవరైనా కానీస్టేబుల్ కరియప్ప మీద వాహనం ఎక్కించారా ? అని కూడా పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications