బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cyber: ఆన్ లైన్ లో టీషర్టు ఆర్డర్ చేసిన అరుణ, మేడమ్ మీకు ?, జస్ట్ రూ. 10 లక్షలు హుష్ కాకి, మ్యాటర్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆన్ లైన్ యాప్‌లో టీషర్ట్ బుక్ చేసుకున్న ఓ మహిళ రూ.10 లక్షలు పోగొట్టుకుంది. లాటరీ పేరుతో సదరు మహిళకు ఏకంగా రూ. 10 లక్షలు పంగనామాలు పెట్టేశారు. లాటరీలో మీకు కారు వచ్చిందని లేఖ పంపిన ఆ ఆన్‌లైన్ వ్యాపారి అరుణ అనే మహిళను మోసం చేశారు. మోసగాళ్లు టీషర్ట్‌తో పాటు పోస్ట్ కార్డులు, స్క్రాచ్ కార్డ్‌లు, లేఖలు పంపారు. తరువాత అసలు కథ మొదలుపెట్టారు.

Business: అల్లుడామజాకా, అత్త కొంప ముంచేసిన అల్లుడు, ఎగిరెగిరి పడుతున్న భార్య, ఏం చేశాడంటే?Business: అల్లుడామజాకా, అత్త కొంప ముంచేసిన అల్లుడు, ఎగిరెగిరి పడుతున్న భార్య, ఏం చేశాడంటే?

తరువాత అసలు కథ మొదలుపెట్టారు. మీరు టీ షర్టు కొనుగోలు చేసిన తరువాత మీరు లాటరీ పద్దతిలో కారు గెలిచుకున్నారని ఆమెను సంప్రధించారు. అరుణతో సైబర్ నేరగాళ్లు అచ్చు కన్నడలో మాట్లాడి ఆమెకు తియ్యటి మాటలు చెప్పారు.

దీన్ని నమ్మిన అరుణ లేఖలోని నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ పంపింది. ఆ వైపు నుంచి కారు కావాలా, డబ్బులు కావాలా అని మోసగాళ్లు అడిగారు. ఆర్థిక సమస్యల కారణంగా కారు బదులు డబ్బులు ఇవ్వాలాలని అరుణ మనవి చేసింది.

A woman who ordered a t-shirt online. The car got in the lottery for Rs. 10 lakhs stolen by cyber criminals in Bengaluru

ముందుగా ప్రాసెసింగ్ ఫీజుగా రూ.14, 800 పంపాలని సైబర్ నేరగాళ్లు అరుణకు చెప్పారు. తరువాత ఇతర ఫీజులు చెల్లించాలని చెప్పి రూ. 10 లక్షలు మోసం చేశారు. ఏకంగా రూ. 10 లక్షలు డబ్బులు పోవడంతో మనస్తాపానికి గురైన అరుణ బెంగళూరులోని విద్యారణ్యపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్ నేరగాళ్ల కోసం గాలిస్తున్నారు.

Romance: జైలు వార్డెన్లు, ఒకడు వల వేస్తే ఇంకొకడు వీడియోలు తీశారు, అర్దరాత్రి సెంట్రల్ జైల్లో ? అబ్బా!Romance: జైలు వార్డెన్లు, ఒకడు వల వేస్తే ఇంకొకడు వీడియోలు తీశారు, అర్దరాత్రి సెంట్రల్ జైల్లో ? అబ్బా!

అరుణతో మాట్లాడి రూ. 10 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు కన్నడలో మాట్లాడటంతో నిందితులు కర్ణాటకలోనే ఉంటున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్ లో కొన్ని వందల రూపాయలకు ఏదైనా కొనుగోలు చేస్తే లక్షల రూపాయల లాటరీలు ఎలా తగులుతాయని, సైబర్ నేరగాళ్లు ఉన్నారని, జాగ్రత్తగా ఉండాలని పదేపదే మనవి చేస్తున్నా ఇలా మోసపోతున్నారని పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

English summary
A woman who ordered a t-shirt online. The car got in the lottery for Rs. 10 lakhs stolen by cyber criminals in Bengaluru
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X