Aunty: పుట్టింటిలో మకాం వేసిన భార్య, అత్త నా కాపురం నాశనం చేస్తోందని అల్లుడు ఫైర్, ఇంట్లోనే ఫినిష్!

బెంగళూరు/ యాదగిరి: మహిళ పెళ్లి చేసుకుని 9 సంవత్సరాలు ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఓ కూతురు ఉంది. కూతురు పుట్టిన తరువాత భర్త చనిపోవడంతో ఆమె రెండో పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లి చేసుకుని ఆమె భర్తతో కాపురం చేస్తోంది. మహిళ కూతురికి పెళ్లి అయ్యింది. కాపురం చేస్తున్న ఆమెకుభర్తతో గొడవలు జరిగాయి. గొడవలు ఎక్కువ కావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను పిలుచుకుని రావాలని ఆమె భర్త అనేక ప్రయత్నాలు చేశాడు.

నేను నా పుట్టింటిలోనే ఉంటానని, నీతో కలిసి నేను కాపురం చెయ్యలేనని భార్య తేల్చి చెప్పింది. తన భార్య దూరం కావడానికి ఆమె తల్లి కారణం అని యువకుడు రగిలిపోయాడు. ముఖానికి టవల్ చుట్టుకుని ముఖం కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్న అల్లుడు అతని భార్య తల్లిని ఆమె ఇంట్లోనే చంపేయడం కలకలం రేపింది.

మహిళ భర్త చనిపోయాడు

మహిళ భర్త చనిపోయాడు

కర్ణాటకలోని యాదగిరిలోని ఛటాన్ గల్లీ ఏరియాలో రషీదా బేగం అనే మహిళ నివాసం ఉంటున్నది. 20 సంవత్సరాల క్రితం రషీదా బేగం నిషార్ అహమ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రషీదా బేగం, నిషార్ అహమ్మద్ కు సిమ్రాన్ అనే కూతురు పుట్టింది. సిమ్రాన్ కు 8 సంవత్సరాల వయసు ఉన్న సమయంలో రషీదా బేగం భర్త నిషార్ చనిపోయాడు.

ముంబాయి వ్యక్తితో కూతురి పెళ్లి

ముంబాయి వ్యక్తితో కూతురి పెళ్లి

భర్త చనిపోయిన తరువాత రషీదా బేగం రెండో పెళ్లి చేసుకుంది. రెండో భర్తతో కాపురం చేస్తున్న రషీదా ఆమె కూతురు సిమ్రాన్ కు పెళ్లి చెయ్యాలని అనుకుంది. ఇదే సమయంలో ముంబాయికి చెందిన రఫీక్ అనే యువకుడితో సిమ్రాన్ పెళ్లి జరిగిపోయింది. ముంబాయి చేరుకున్న సిమ్రాన్ ఆమె భర్తతో కాపురం చేస్తోంది.

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

ముంబాయిలో భర్త రఫీక్ తో కాపురం చేస్తున్న సిమ్రాన్ కు ఆమె భర్తతో గొడవలు జరిగాయి. గొడవలు ఎక్కువ కావడంతో 2020లో సిమ్రాన్ యాదగిరి నగరంలోని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య సిమ్రాన్ ను పిలుచుకుని ముంబాయి వెళ్లాలని ఆమె భర్త రఫీక్ అనేక ప్రయత్నాలు చేశాడు. నేను నా పుట్టింటిలోనే ఉంటానని, నీతో కలిసి నేను కాపురం చెయ్యలేనని సిమ్రాన్ ఆమె భర్త రఫీక్ కు తేల్చి చెప్పింది.

నా కాపురం కూలిపోవడానికి అత్త కారణం

నా కాపురం కూలిపోవడానికి అత్త కారణం

నా భార్య సిమ్రాన్ కు బుద్దిమాటలు చెప్పి ఆమెను కాపురానికి పంపించకుండా అత్త రషీదా బేగం ఆమెను ఇంట్లోనే పెట్టుకుందని, నాకాపురం కూలిపోవడానికి నా అత్త కారణం అని రఫీక్ రగిలిపోయాడు. ముంబాయి నుంచి యాదగిరికి రైలులో వెళ్లిన రఫీక్ అతని అత్త రషీదా ఇంటి దగ్గరకు వెళ్లాడు.

ముఖానికి టవల్ చుట్టుకుని ముఖం కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్న రఫీక్ అతని భార్య సిమ్రాన్ తల్లి రషీదాను ఆమె ఇంట్లోనే చంపేయడం కలకలం రేపింది. భార్య సిమ్రాన్ తల్లి రషీదాను హత్య చేసిన రఫీక్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+