బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Swamiji: బ్లాక్ మెయిల్ చేశారని స్వామీజీ ఆత్మహత్య, కాలేజ్ అమ్మాయి వ్యవహారం సీడీతో ?, చార్జ్ షీట్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/రామనగర: కర్ణాటకలోని బెంగళూరు గ్రామీణ జిల్లా సమీపంలోని మాగడి తాలుకాలో కంచుగల్ బండే మఠం ఉంది. కుంచుగల్ బండే మఠం మఠాధిపతిగా బసవలింగ స్వామీజీ (45) పని చేశారు. ఇటీవల కంచుగల్ బండే మఠం స్వామీజీ బసవలింగస్వామీజీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బ్లాక్ మెయిల్ చేశారని బసవలింగ స్వామీజీ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేశారు.

ఈ కేసులో ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయి, ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చర్, లాయర్ కూడా నిందితులుగా ఉన్నారు. పోలీసుల 216 పేజీల చార్జ్ షీట్ కోర్టుకు సమర్పించడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

Lady: నీకు ఎంత మంది మొగుళ్లు కావాలి, ఎంతమంది పిల్లల్ని కంటావు, ఫస్ట్ భర్త ఫ్యామిలీ ఏం చేసిందంటే?Lady: నీకు ఎంత మంది మొగుళ్లు కావాలి, ఎంతమంది పిల్లల్ని కంటావు, ఫస్ట్ భర్త ఫ్యామిలీ ఏం చేసిందంటే?

మఠంలో స్వామీజీ ఆత్మహత్య

మఠంలో స్వామీజీ ఆత్మహత్య

బెంగళూరు సమీపంలోని మాగడి తాలుకాలో కంచుగల్ బండే మఠం మఠాధిపతిగా పని చేసిన బసవలింగ స్వామీజీ (45)కి మంచి పేరు పలుకుడి ఉంది. అక్టోబర్ చివరి వారంలో కంచుగల్ బండే మఠం స్వామీజీ బసవలింగస్వామీజీ ఆయన నివాసం ఉంటున్న మఠంలోని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కర్ణాటకలో కలకలం రేపింది.

డెత్ నోట్ రాసిన స్వామీజీ

డెత్ నోట్ రాసిన స్వామీజీ

బసవలింగ స్వామీజీ ఆత్మహత్య చేసుకునే ముందు మూడు పేజీల డెత్ నోట్ రాశారని పోలీసులు అప్పట్లో చెప్పారు. బసవలింగ స్వామీజీ రాసిన డెత్ నోట్ లో ఓ మహిళ పేరు ప్రస్తావించారని, ఆమె టార్చర్ ఎక్కువ అయ్యిందని స్వామీజీ డెత్ నోట్ లో రాశారని అప్పట్లో కన్నడ మీడియా తెలిపింది.

కాలేజ్ అమ్మాయి

కాలేజ్ అమ్మాయి

బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసులో దొడ్డబళ్లాపురం సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న నీలాంబికే అనే యువతి అరెస్టు కావడంతో మఠం భక్తులు హడలిపోయారు బసవలింగ స్వామీజీ సోదరుడు అయిన కణ్ణూరు మఠం స్వామీజీ మృంత్యుంజయ స్వామీజీ, లాయర్ మహదేవయ్య ఇదే కేసులో అరెస్టు అయ్యి జైల్లో ఉన్నారు.

72 మంది సాక్షులు, 216 పేజీల చార్జ్ షీట్

72 మంది సాక్షులు, 216 పేజీల చార్జ్ షీట్

మాగడి పోలీసులు ఒకటిన్నర నెల నుంచి బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసు దర్యాప్తు పూర్తి చేశారు. మొత్తం 72 మంది సాక్షులను విచారణ చేసిన పోలీసులు 216 పేజీల చార్జ్ షీట్ తయారు చేసి మాగడి కోర్టుకు సమర్పించారు. స్వామీజీ ఆత్మహత్య కేసులో నాలుగో నిందితుడు అయిన సిద్దగంగ మఠం ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ సురేష్ ఇంత వరకు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.

అమ్మాయితో మాట్లాడిన సీడీ లీక్

అమ్మాయితో మాట్లాడిన సీడీ లీక్

బసవలింగస్వామీజీ యువతితో మాట్లాడిన సీడీ లీక్ కావడం వలనే ఆవేదనతో స్వామీజీ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. స్వామీజీ గదిలో స్వాధీనం చేసుకున్న డెత్ నోట్ ఆధారంగా విచారణ చేశామని పోలీసులు తెలిపారు. రెండు డెత్ నోట్ లు రాసిన బసవలింగ స్వామీజీ మూడో డెత్ నోట్ అర్దం రాత్రి దానికి గదిలో విసిరేశాడని పోలీసులు అన్నారు. పోలీసులు 216 పేజీల చార్జ్ షీట్ కోర్టుకు సమర్పించడంతో అందులో ఇంకా ఏమేమి సమాచారం ఉంది అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Basavalinga swamiji in Karnataka committed suicide due to blackmail, police presented charge sheet in Magadi court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X