బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: అర్దరాత్రి జంటతో ఆడుకున్న గస్తీ పోలీసులు, గూగుల్ పే దెబ్బతో గూబ గుయ్ మనింది !

లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు భారీ మొత్తంలో లంచాలు వసూలు చేస్తున్నారు. అర్దరాత్రి దంపతులను బెదిరించి గూగుల్ పే ద్వారా లంచం తీసుకున్న ఇద్దరు పోలీసుల గూబ గుయ్ మని అనడమేకాకుండా శాస్వతంగా ఇంటికి వెళ్లిపోయారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హెబ్బాళ: ఐటీ హబ్ లో పోలీసులు ఏరకంగా దండుకోవాలో ఆరకంగా దండుకోవడం మొదలుపెట్టడంతో సామాన్య ప్రజలు, ఇతర రాష్ట్రల ప్రజలు హడలిపోతున్నారు. ఏదోఒక రకంగా ప్రజలను హింసిస్తున్న కొందరు పోలీసులు లంచాలు వసూలు చేస్తూ సాటి నిజాయితీ పోలీసులకు చెడ్డపేరు తీసుకువస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు భారీ మొత్తంలో లంచాలు వసూలు చేస్తున్నారు. అర్దరాత్రి దంపతులను బెదిరించి గూగుల్ పే ద్వారా లంచం తీసుకున్న ఇద్దరు పోలీసులు శాస్వతంగా ఇంటికి వెళ్లిపోయారు.

Wife; అక్రమ సంబంధం, 18 ఏళ్ల తరువాత భర్తకు డౌట్, డంబిల్ తో తీరికగా భార్యను చంపేసి సోఫాలో ? !Wife; అక్రమ సంబంధం, 18 ఏళ్ల తరువాత భర్తకు డౌట్, డంబిల్ తో తీరికగా భార్యను చంపేసి సోఫాలో ? !

 కమీనర్ రెడ్డికి కోపం వచ్చింది

కమీనర్ రెడ్డికి కోపం వచ్చింది

బెంగళూరు నగరంలోని హెబ్ళాళ- మారతహళ్లి రింగ్ రోడ్డులోని నాగవార సమీపంలోని మాన్యత టెక్ పార్క్ సమీపంలో దంపతులను బెదిరించి లంచం వసూలు చేసుకుని వారిని నిలువు దోపిడీ చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు హొయస్స పోలీసు సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించామని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. హెడ్ ​​కానిస్టేబుల్ రాజేష్, కానిస్టేబుల్ నగేష్‌లను డిస్మిస్ చేశామని, వారిపై మరికొన్ని కేసులు పెట్టామని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని బెంగళూరు సిటీ కమిషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు.

ఫ్రెండ్ బర్త్ డే పార్టీ

ఫ్రెండ్ బర్త్ డే పార్టీ

డిసెంబర్ 8వ తేదీన మాన్యత టెక్ పార్క్ సమీపంలో తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుక ముగించుకుని కార్తీక్, అతని భార్య అర్దరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో హొయస్సల పెట్రోలింగ్ సిబ్బంది రాజేష్, నగేష్ భార్యతో కలిసి నడుచుకుంటూ వెలుతున్న కార్తీక్‌ను అడ్డుకున్నారు. ఈ సమయంలో రాత్రి 11 గంటల తర్వాత రోడ్డుపై సంసచరించకూడదని, ఎందుకు మీరు ఇప్పుడు వెలుతున్నారని, మీ ఇద్దరికి సంబంధం ఏమిటి, మీరు ఎవరు తదితర ప్రశ్నలు కార్తీక్ దంపతులను వేశారు.

మూడు వేలు డిమాండ్ చేసిన పోలీసులు

మూడు వేలు డిమాండ్ చేసిన పోలీసులు

మీ గుర్తింపు కార్డులు చూపించాలని కార్తీక్ దంపతులకు పోలీసులు చెప్పారు. కార్తీక్ తన మొబైల్ ఫోన్‌లోని ఆధార్ కార్డును పోలీసులకు చూపించాడు. అంతటితో సరిపెట్టుకోని పోలీసులు కార్తీక్ దంపతుల మొబైల్ ఫోన్ తీసుకుని రూ. 3 వేలు జరిమానా కట్టాలని బెదిరించారు. జరిమానా చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కార్తీక్ దంపతులను బెదిరించారు.

గూగుల్ పేలో రూ. 1 వెయ్యి లంచం

గూగుల్ పేలో రూ. 1 వెయ్యి లంచం

పోలీసుల తీరుకు భయపడిన కార్తీక్ దంపతులు చివరకు క్యూఆర్‌ కోడ్‌తో పోలీసులకు వెయ్యి రూపాయలు లంచం ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మనస్తాపానికి గురైన కార్తీక్ బెంగళూరు సిటీ పోలీసుల ట్విట్టర్ అకౌంట్ కు ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశాడు. రాత్రి జరిగిన ఘటనను సవివరంగా వివరించాడు. రాత్రి 11 గంటల తర్వాత నడవకూడదనే నిబంధన ఏమైనా ఉందా అని బెంగళూరు సిటీ పోలీసులను ప్రశ్నించారు.

నరకం అనుభవిస్తున్నాము

నరకం అనుభవిస్తున్నాము

ఈ ఘటన తరువాత ఇంట్లో నేను, నా భార్య సరిగా నిద్రపోవడం లేదని, ఎప్పుడు పోలీసులు వచ్చి ఇబ్బంది పెడుతారో అని భయంగా ఉందని ట్విట్టర్ లో ఆవేదన వ్యకత్ం చేశారు. పోలీసుల తీరుతో నేను, నా భార్య మానసికంగా ఇబ్బంది పడుతున్నామని కార్తీక్ బెంగళూరు పోలీసులకు ట్వీట్ ర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఈ ట్వీట్‌ ఫిర్యాదును పరిశీలించిన పోలీసు అధికారులు కార్తీక్ దంపతులను బెదిరించి లంచం వసూలు చేశారని నేరం రుజువు కావడంతో ఇద్దరిని ఇంటికి పంపించేశారు.

English summary
Bengaluru City Police Commissioner Pratap Reddy suspends cops who threatened couple and took bribe in Google Pay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X