హ్యాట్రిక్ ఎమ్మెల్యే సతీష్ రెడ్డికి ఎలా చెక్ పెట్టాలి, సీన్ లోకి టాప్ సినీ నిర్మాత, వర్కౌట్ అయితే?
బెంగళూరు/ఎలక్ట్రానిక్ సిటీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయిపోవాలని చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి నిమిషంలో ఏమైనా జరిగే అవకాశం ఉందని రాజకీయ నాయకులకు తెలుసు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే సతీష్ రెడ్డికి చెక్ పెట్టాలని ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నాలుగో సారి ఎమ్మెల్యే కావాలని సతీష్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
బెంగళూరులోని బోమ్మనహళ్లి అసెంబ్లీ నియోజక వర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజక వర్గంలో తెలుగు ప్రజలుఎవరికి ఓటు వేస్తారో వాళ్లే కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు. బోమ్మనహళ్లి నియోజక వర్గంలో రెడ్డి (తెలుగు), ఒక్కలిగ, ఎస్ సీ, ముస్లీం సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే మెజారిటీ ఓటర్లు మాత్రం రెడ్డి, తెలుగు వాళ్లే ఉన్నారు.

2019 లోక్ ఎన్నికల సందర్బంగా అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు బోమ్మనహళ్లి నియోజక వర్గంలో 4, 25, 672 ఓటర్లు ఉన్నారు. బీజేపీ నాయకుకుడు సతీష్ రెడ్డి బోమ్మనహళ్లి నగరసభ అధ్యక్షుడిగా విజయం సాధించిన తరువాత సతీష్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. 2008లో బోమ్మనహళ్లి బీజేపీ టిక్కెట్ సంపాధించిన సతీష్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు.
తరువాత 2013, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా బీజేపీ ఎమ్మెల్యే అయిన సతీష్ రెడ్డి బోమ్మనహళ్లి నియోజక వర్గం హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిపోయారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపుగా సతీష్ రెడ్డికే బీజేపీ టిక్కెట్ దక్కే అవకాశం ఉంది. బోమ్మనహళ్లిలో బలమైన బీజేపీ అభ్యర్థి అయిన సతీష్ రెడ్డిని ఓడించి ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కాంగ్రెస్ పార్టీ నాయుకులు డిసైడ్ అయ్యారు.
శ్రీమంతుల కుటుంబానికి చెందిన యువకుడు, ప్రముఖ వ్యాపారి, సినీ నిర్మాత ఉమాపతి గౌడ బోమ్మనహళ్లి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే ఇంత వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉమాపతి గౌడకు టిక్కెట్ ఇస్తామని హామీ ఇవ్వలేదు. అయితే బోమ్మనహళ్లిలో తెగతిరిగేస్తున్న ఉమాపతి గౌడ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. 2018లోనే కాంగ్రెస్ టిక్కెట్ కోసం ఉపమాపతి గౌడ అనేక ప్రయత్నాలు చేశారు. అయితే చివరి నిమిషంలో సుష్మా రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్ దక్కడంతో సతీష్ రెడ్డి చేతిలో ఆమె ఓడిపోయారు. మొత్తం మీద బెంగళూరులో ఇప్పుడు బోమ్మనహళ్లి నియోజక వర్గం మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఫోకస్ పెట్టింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications